మార్చురీ పక్కన అన్నా క్యాంటీన్‌

30 Jul, 2019 10:21 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభ వాడివేడిగా ప్రారంభమైంది. ఫైబర్‌ గ్రిడ్‌, అన్నా క్యాంటీన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరిగిందని అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆరోపించారు. చివరి రోజు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. అధికార పార్టీ సభ్యుడు రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి ‘అన్నా క్యాంటీన్ల’ అవకతకలను సభలో ప్రస్తవించారు. అన్నా క్యాంటీన్లను పెట్టి టీడీపీ నేతలు ప్రచారానికి వాడుకున్నారని, వాటిని ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ క్యాంటీన్ల పేరిట టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని, ఒక్కొక్క క్యాంటీన్‌కు రూ.40-50 లక్షలు ఖర్చు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. మంత్రి బొత్ససత్యనారాయణ మాట్లాడుతూ.. పేదవాడి కడుపుకొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని, అన్నా క్యాంటీన్లను మూసివేయలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం హడావుడిగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని, మార్చురీ పక్కన కూడా పెట్టారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాటిపై పూర్తి ప్రక్షాళన జరిపి ప్రజలకు మేలు చేకూర్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు బోత్స తెలిపారు. రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లు మాత్రమే ఉన్నాయన్నారు.

అనంతరం జోగి రమేష్‌ ఫైబర్‌ గ్రిడ్‌ పేరిట జరిగిన వందల కోట్ల అవినీతిని సభ దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం తన అనుయయులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టిందన్నారు. రూ.149లకే టీవీ, ఇంటర్నెట్‌, ఫోన్‌ కనెక్షన్‌ ఇస్తామని ప్రచారం చేశారని, సెటాప్‌ బాక్స్‌లకు రూ.5 వేల చొప్పున వసూలు చేశారని తెలిపారు. ఫైబర్‌ గ్రిడ్లో అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం చట్టాలను తుంగలో తొక్కిందని, ట్రాయ్‌ రూల్స్‌ విరుద్ధంగా వ్యవహరించిందని ఆర్కే తెలిపారు. ఈవీఎం చోరీ కేసులో నిందితుడికి కాంట్రాక్ట్‌లు కట్టబెట్టిందని, జగన్‌ పాదయాత్ర ప్రజల్లోకి వెళ్లకుండా గత ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. బహిరంగ సభలు ప్రజలు చూడకుండా కేబుల్‌ ప్రసారాలు నిలిపేసిందని ఆరోపించారు. ఫైబర్‌ గ్రిడ్‌లో అవినీతి జరిగిందని, విచారణ జరిపిస్తామని మంత్రి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా కమ్యునికేషన్‌ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చంద్రబాబు భావించారని మంత్రి రాజేంద్రనాథ్‌ అన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ కేబుల్‌ డ్యామేజ్‌ అయితే నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టమని బాబే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఏ స్కీమ్‌ చూసినా వేల కోట్ల అవినీతే కనబడుతుందని, ఫైబర్‌ గ్రిడ్‌పై విచారణ జరిపిస్తామన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పార్లమెంట్‌ నియోజకవర్గానికో స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌

‘చంద్రబాబు వల్లే ఈడబ్ల్యూఎస్‌లో కాపులకు నష్టం’

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు

‘జర ఓపిక పట్టు తమ్మీ’

7 లక్షలు తెచ్చుకొని 3 లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టారు

ఎంపీలంతా పార్లమెంటుకు హాజరుకావాలి: మోదీ

గుర్రాలతో తొక్కించిన విషయం మరిచిపోయారా?

మాస్‌ లీడర్‌ ముఖేష్‌గౌడ్‌

విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం

క్షమాపణ చెప్పిన ఆజంఖాన్‌

ఎన్‌ఎంసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కాపులపై చంద్రబాబుది మోసపూరిత వైఖరే

‘సీఎం వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం’

‘ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాలి’

జలగలు రక్తం పీల్చినట్టు.. ఫీజుల్ని దండుకుంటున్నారు

‘వంద కోట్లకు పైగా తగలేశారు’

చట్టవ్యతిరేక పనులను సహించం

రమేశ్‌ భేష్‌; సిద్దు మెచ్చుకోలు

ప్రజావేదికను టీడీపీ మరిచిపోతే మంచిది : మంత్రి అవంతి

ఈ బడ్జెట్‌తో మళ్లీ రాజన్న రాజ్యం: రోజా

‘ఎన్నికల బాండు’ల్లో కొత్త కోణం

సీఎం జగన్‌తో పార్టీ కాపు నేతలు భేటీ

ఉన్నావ్‌ ప్రమాదం: ప్రియాంక ప్రశ్నల వర్షం

మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం; పేడతో శుద్ధి!

కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా

జగన్‌ మొదటి బడ్జెట్‌.. మనసున్న బడ్జెట్‌

కర్ణాటక స్పీకర్‌ రాజీనామా

ఇసుక.. టీడీపీ నేతల పొట్టల్లో ఉంది

విశ్వాస పరీక్షలో నెగ్గిన యడ్డీ సర్కార్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరోసారి ‘అ!’ అనిపిస్తారా?

కోలీవుడ్‌లో ఫ్యాన్స్‌ వార్.. హీరో మృతి అంటూ!

‘నాకింకా పెళ్లి కాలేదు’

‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..