బళ్లారి జిల్లాకు 2 మంత్రి పదవులు?

20 May, 2018 07:13 IST|Sakshi

ప్రయత్నాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 

సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో ఏర్పాటు కానున్న జేడీఎస్‌–కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో బళ్లారి జిల్లా నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందడం తెలిసిందే. బళ్లారి ›గ్రామీణ నియోజకర్గం నుంచి నాగేంద్ర, సండూరు నుంచి తుకారాం, హడగలి నుంచి పరమేశ్వర్‌ నాయక్, విజయనగర నియోజకవర్గం నుంచి ఆనంద్‌సింగ్‌ ఉన్నారు. వీరిలో కొందరు మంత్రి పదవి కోసం ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నూతన సంకీర్ణ ప్రభుత్వంలో బళ్లారి జిల్లా నుంచి గెలుపొందిన ఆరు మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ప్రముఖంగా పరమేశ్వర్‌ నాయక్, నాగేంద్ర, ఆనంద్‌సింగ్, తుకారాంల పేర్లు వినిపిస్తున్నప్పటికీ జిల్లా నుంచి ఇద్దరికి  మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి రేస్‌లో ఉన్న వారు సీనియర్లు కావడంతో పదవులను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవులపై ఎవరికివారే అంచనాల్లో మునిగిపోయారు. 

మరిన్ని వార్తలు