28 మంది మహిళా ఎంపీలు మళ్లీ..

24 May, 2019 05:33 IST|Sakshi

భారీ ఆధిక్యంలో స్మృతీ, ప్రజ్ఞా

న్యూఢిల్లీ: 41 మంది సిట్టింగ్‌ మహిళా ఎంపీల్లో 28 మంది మహిళా ఎంపీలు ముందంజలో ఉన్నారు. సోనియా గాంధీ, హేమ మాలిని, కిరణ్‌ ఖేర్‌ వం టి సిట్టింగ్‌ ఎంపీలు ఈ ఎన్నికల్లో తమ స్థానాన్ని పదిల పరచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే స్మృతీ ఇరానీ, ప్రజ్ఞా ఠాకూర్‌ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. రాయ్‌ బరేలి నుంచి కాంగ్రె స్‌ ఎంపీ సోనియా గాంధీ, పిలిభిత్‌ నుంచి బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ మేనకా గాంధీ, మధుర బీజేపీ ఎంపీ మాలిని, చంఢీగఢ్‌ బీజేపీ అభ్యర్థి ఖేర్, కనౌజ్‌ ఎస్పీ ఎంపీ డింపుల్‌ యాదవ్, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి వంటి ప్రముఖులు ముందంజ లో ఉన్నారు. కాగా, అసన్‌సోల్‌ నుంచి బంకుర టీఎమ్‌సీ ఎంపీ మున్‌ మున్‌ సేన్, కాంగ్రెస్‌ సిల్చర్‌ ఎంపీ సుస్మితా దేవ్, సుపాల్‌ కాంగ్రెస్‌ ఎంపీ రంజీత్‌ రంజన్, బర్ధమాన్‌–దుర్గాపూర్‌ టీఎంసీ అభ్యర్థి మమ్తాజ్‌ సంఘమిత్ర, హూగ్లీ టీఎంసీ ఎంపీ అభ్యర్థి రత్న డే, లాల్‌గంజ్‌ ఎంపీ నీలం సోన్‌కార్‌ వెనుకంజలో ఉన్నారు.

బీజేపీ నుంచి లీడింగ్‌లో ఉన్న మహిళా సిట్టింగ్‌ ఎంపీలు 16 మంది కాగా, కాంగ్రెస్‌ నుంచి కేవలం సోనియా గాంధీ మాత్రమే లీడ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటలా భావించే అమేథీలో స్మృతి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతూ రాహుల్‌ గాంధీపై చారిత్రక విజయాన్ని నమోదు చేయనున్నారు. కాగా భోపాల్‌ వివాదాస్పద బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా తన ప్రత్యర్థి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై ముందంజలో ఉన్నారు. అలాగే తూత్తుకూడి డీఎంకే అభ్యర్థి కనిమొళి కరుణానిధి, ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ గెలుపుబాటలో ఉన్నారు. టీఎంసీ తరపున పోటీ పడుతున్న బెంగాళీ నటి లాకెట్‌ చటర్జీ హూగ్లీ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 54 మహిళా అభ్యర్థులను బరిలోకి దింపగా, బీజేపీ తరపున 53 మంది మహిళలు పోటీపడ్డారు. యూపీ నుంచి అత్యధికంగా 104 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

మరిన్ని వార్తలు