ఒంటిగంట వరకు 39.16శాతం పోలింగ్‌ నమోదు

12 May, 2019 14:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో దేశ వ్యాప్తంగా 59 లోక్‌సభ స్థానాలకు  ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా సాగుతోంది. బెంగాల్‌లో బీజేపీ-తృణమూల్‌ కార్యకర్తల మధ్య కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రెండు పార్టీల నేతలు రిగింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. కొన్ని పాం‍త్రాల్లో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో పోలింగ్‌కు కొంత అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఈవీఎంలు సరిగా పనిచేయడంలేదని ఆప్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కాగా 1 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతం వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. 1 గంటల వరకు దేశ వ్యాప్తంగా 39.16శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు.  

రాష్ట్రాల వారిగా 1 గంటల వరకు నమోదైన పోలింగ్‌ వివరాలు
బిహార్‌ : 35.22 శాతం 
హర్యానా : 37.70 శాతం
మధ్యప్రదేశ్‌ : 41.36శాతం
ఉత్తర ప్రదేశ్‌ : 34.16శాతం
ఢిల్లీ : 28.69శాతం
పశ్చిమ బెంగాల్‌ : 52.31శాతం
జార్ఖండ్‌ : 46.64శాతం

 

>
మరిన్ని వార్తలు