నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు

25 Jul, 2019 14:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు పడింది. నదీ జలాల పంపకంపై సభలో చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు సభకు ఆటంకం కలిగించారు. దీంతో స్పీకర్‌ నలుగురు సభ్యులను ఒక్కరోజుపాటు శాసనసభ నుంచి సస్పెండ్‌ చేశారు. సభ నుంచి సస్పెండ్‌ అయినవారిలో అశోక్‌ బెందాళం, వాసుపల్లి గణేష్‌, వెలగపూడి రామకృష్ణ, డోలా బాలవీరాంజనేయులు ఉన్నారు. వారంతా సభ నుంచి వెళ్లాలని స్పీకర్‌ సూచించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మార్షల్స్‌ సాయంతో బయటకు పంపించారు. మరోవైపు సస్పెన్షన్‌కు నిరసనగా చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. కాగా రెండురోజుల క్రితం ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యే(అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు)లను స్పీకర్‌ సమావేశాలు పూర్తయ్యేవరకూ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు