జార్ఖండ్‌లో 56.58% పోలింగ్‌ నమోదు

17 Dec, 2019 01:44 IST|Sakshi

రాంచీ: జార్ఖండ్‌లో నాలుగవ విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 15 నియోజకవర్గాల్లో జరిగిన ఈ పోలింగ్‌లో 56.58 శాతం ఓటింగ్‌ నమోదైందని అధికారులు తెలిపారు. మొత్తం నాలుగు జిల్లాల్లో సోమవారం ఈ ఎన్నికలు జరిగాయి. జమువా నియోజకవర్గంలో 50, 51 బూత్‌లలో  ఓట్లు వేసేందుకు నిరాకరించారు. మొత్తం 6,101 పోలింగ్‌ కేంద్రాల్లో 587 సమస్యాత్మకమైనవిగా, 405 సున్నితమైనవిగా గుర్తించారు. 20న చివరి దశ పోలింగ్‌ జరగనుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని వార్తలు