‘పార్టీని వీడటానికి.. ఆమె కారణాలు వెతు‍కుతున్నారు’

5 Feb, 2019 14:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తనను కావాలనే దూరం పెడుతున్నారంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లంబా చేసిన వ్యాఖ్యలపై ఆప్‌ మండిపడింది. ఈ విషయంపై స్పందించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ.. ‘పార్టీని వీడడానికి ఆమె కారణాలు వెతుక్కుంటున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారెవరైనా సస్పెండ్‌ చేసే అధికారం పార్టీ అధిష్టానానికి ఉంటుంది. కానీ అల్కాను పార్టీ నుంచి తొలగించాలనే ఉద్దేశం లేదు. మా పార్టీని వీడిన కొన్నాళ్లకు మారిపోయామన్న నేతలను కూడా తిరిగి పార్టీలో చేర్చుకున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఇక సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అల్కాను ట్విటర్‌లో అన్‌ఫాలో చేయడాన్ని ప్రస్తావిస్తూ.. అది ఆయన సొంత విషయమని పేర్కొన్నారు.(ఆప్‌ తీరుపై అల్కా లంబా విమర్శలు)

కాగా సిక్కు వ్యతిరేక అల్లర్లలో రాజీవ్‌ గాంధీపై కూడా ఆరోపణలు ఉన్నాయని, ఆయనకిచ్చిన దేశ అత్యున్నత పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ అసెంబ్లీ తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చాందినీ చౌక్‌ ఎమ్మెల్యే ఆల్కా లంబా పేర్కొన్నారు. దీంతో ఆమె పార్టీని వీడనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారమవుతున్నాయి.

మరిన్ని వార్తలు