పెరిగిన ఇంధన ధరలపై ఆమ్‌ఆద్మీ నిరసన

27 Sep, 2017 02:51 IST|Sakshi

ప్రధాని దిష్టిబొమ్మ దహనం

రాయగడ:పెట్రోల్,డీజిల్, వంటగ్యాస్‌ ధరల పెంపుదలను నిరసిస్తూ  రాయగడలోని కపిలాస్‌ జంక్షన్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఉద యం 11గంటల సమయంలో ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు జొన్మొజొనొస్వొంయి అధ్యక్షతన నిర్వహిం చిన సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఇంధన ధరలు పడిపోతుంటే కేంద్రప్రభుత్వం  ఇంధన ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతోందని ఆరోపించారు.  గత 3సంవత్సరాలలో ప్రభుత్వం వరుసగా ఇంధన  ధరలు పెంచడం వల్ల  ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌  రూ.73కు చేరుకుందని మండిపడ్డారు.    2015 లో ఇంధన ధరలు తగ్గిస్తామన్న ప్రభుత్వం ధరలు తగ్గించలేదని,  తరచూ ధరలు పెంచుతూ పోతోంద ని ఆరోపించారు.

అనంతరం ప్రధా ని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను రావణునిగా పోల్చి దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టి.సంగన్న, సోమానాథ్‌ హుయిక, దొరకొండగిరి, జితేంద్రసేనాపతి, చైతన్యబేణియా, దుర్గాచరణ పట్నాయక్, నాగేష్‌బిడిక, మహిళా సభ్యులు  దేవికొండగిరి, భాగ్యవతి రొహులొ, రాణివాజ్‌పా, సుభాషిణినాయక్, సునీతనాయక్, అనితపాత్రో, ఇతర సభ్యులు పాల్గొన్నారు. అలాగే   ఆమ్‌ఆద్మీపార్టీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌లో రైల్‌రోకో చేపట్టి నిరసన తెలియజేశారు.     

మరిన్ని వార్తలు