చింతమనేని అక్రమాలు బట్టబయలు

29 Jun, 2019 18:59 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై విమర్శల వర్షం కురిపించారు. పశుసంవర్ధక శాఖ లబ్దిదారుల జాబితాలో చింతమనేని అవకతవకలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. మొన్న పైపుల దొంగతనం కేసులో నిందితునిగా ఉన్న చింతమనేని నేడు గొర్రెల ఎక్స్‌గ్రేషియాను స్వాహా చేశారని అన్నారు. చింతమనేని‌ ఆయన భార్య, తండ్రి పేర్లమీద అక్రమంగా లబ్ది పొందారని ఆరోపించారు. గొర్రెల నష్టపరిహారం అక్రమంగా కాజేసినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 
(సాగునీటి పైపులు ఎత్తుకెళ్లిన చింతమనేని )

డీడీఆర్సీ మీటింగ్‌లో పాల్గొన్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చింతమనేని అక్రమాలపై విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో అర్హులైన లబ్దిదారులకి గేదెలు అందలేదని, బినామీ పేర్లతో చింతమనేని తీసుకున్నారని మండిపడ్డారు. ఇదిలాఉండగా... పోలవరం భూసేకరణలో జరిగిన అక్రమాలను ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, వీఆర్ ఎలీజా సభ దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం భూసేకరణలో జరిగిన అక్రమాలపైనా విచారణ జరపాలని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కలెక్టర్‌ను ఆదేశించారు.’’’’’’’’’’’’’’’’

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దీపంతో మహమ్మారిని ఎలా ఆపుతారు?

టార్చిలైట్లు వేసినంత మాత్రాన..

'బాబు.. నీ బోడి సలహాలు అవసరం లేదు'

ముందుచూపు లేని మోదీ సర్కారు

ఏడాది కింద కరోనా వచ్చుంటేనా..

సినిమా

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!