బీజేపీలోకి నమిత, రాధారవి

1 Dec, 2019 05:11 IST|Sakshi

నడ్డా సమక్షంలో కాషాయం కండువా

సాక్షి, చెన్నై: సినీ నటులు నమిత, రాధారవి బీజేపీలో చేరారు. శనివారం చెన్నైకి వచ్చిన బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో వీరు కాషాయం కండువా కప్పుకున్నారు. రాధారవికి బీజేపీ నేత, సినీ నటుడు ఎస్వీ శేఖర్‌ అభినందనలు తెలియజేశారు. అయితే సినీ నేపథ్య గాయని చిన్మయి మాత్రం తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహిళలను కించ పరిచే రీతిలో స్పందించే రాధారవిని పార్టీలో చేర్చుకోవడంతో నష్టం తప్పదని అన్నారు.

మరిన్ని వార్తలు