నాదెండ్ల చేరికతో పార్టీకి అదనపు శక్తి 

13 Oct, 2018 05:28 IST|Sakshi

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్య 

 పార్టీలో చేరిన మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌

సాక్షి, అమరావతి: జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్‌ చేరడంతో పార్టీకి అదనపు శక్తి వచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్‌ జనసేనలో చేరారు. ఆయనకు పవన్‌ కల్యాణ్‌ పూలమాల వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ‘జనసేనలో చేరమని గతంలో ఒకసారి నాదెండ్లను కోరాను తప్ప ఒత్తిడి చేయలేదు.

ఇటీవల నాలుగు రోజులు మా మధ్య చర్చలు జరిగాయి. ఆయనతో నా ఆలోచనలు కలిశాయి.’ అని అన్నారు. నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ..‘అయిదు విషయాల్లో ఎక్కడ రాజీ ధోరణి లేకుండా ముందుకు వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాం. ఏ రాజకీయ నాయకుడిలో కనిపించని ఎమోషనల్‌ ఫీలింగ్స్‌ పవన్‌ కల్యాణ్‌లో ఉన్నాయి.  కాగా, అంతకుముందు పవన్‌ కల్యాణ్,నాదెండ్ల మనోహర్, ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌  శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు