బాబుకు ఆ వైర‌స్ సోకింది: మంత్రి

9 Apr, 2020 18:28 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: ‘చ‌ంద్ర‌బాబు ప్ర‌తి విష‌యాన్ని రాజ‌కీయం చేస్తున్నారు. క‌రోనాపై కాకుండా మా ప్ర‌భుత్వంపై, మాపై పోరాటం చేస్తున్నారు అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్ర‌పంచానికి కోవిడ్ సోకితే బాబుకు నీచ రాజ‌కీయ వైర‌స్ సోకింద‌’ని ఎద్దేవా చేశారు. గురువారం ఆయ‌న హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి మాట్లాడుతూ.. కోవిడ్‌-19 నియంత్ర‌ణ కోసం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చ‌ర్య‌లు తీసుకుంటుంటే మాస్కులు, కిట్లు లేవ‌ని నింద‌లు వేస్తున్నార‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఆప‌రేష‌న్ డాక్ట‌ర్ విక‌టించ‌డంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. లోకేష్, అయ్యన్నపాత్రుడు డైరెక్షన్‌లో డాక్ట‌ర్ సుధాక‌ర్ కూడా N95 మాస్కులు లేవంటూ అస‌త్య ప్ర‌చారానికి దిగాడ‌ని మండిప‌డ్డారు. (హలో.. జర సునో!)

ఒక డాక్ట‌ర్ అయి ఉండి, ఇలాంటి దురాలోచ‌న ఎందుకు వ‌చ్చిందో తెలియ‌ట్లేద‌ని ఆదిమూల‌పు సురేష్ అన్నారు. ఈ ఆపత్కాలంలో డాక్టర్ల సేవలను కొనియాడాల్సింది పోయి ఒక వైద్యుడిగా ఇలా నిందలు వేయడం సరి కాదని హిత‌వు ప‌లికారు. పీపీఈ  కిట్లు, N95 మాస్కుల కొర‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు. N95 మాస్కులు 20 నుంచి 25 రోజుల‌పాటు వాడ‌వ‌చ్చని ప్రోటోకాల్ చెప్తోందన్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. క‌రోనా వ్య‌తిరేక పోరాటం కోసం రూ.3000 కోట్ల నిధులు విడుదల చేశామ‌ని, రూ.1000, బియ్యం, చక్కెర ఉచితంగా పేదలకు ఇస్తున్నామ‌న్నారు. దేశంలోనే మెచ్చుకునే విధంగా గ్రామ వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. (అయ్యన్నకు కుట్ర రాజకీయాలు అలవాటే : సన్యాసిపాత్రుడు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా