తేలని జమ్మలమడుగు పంచాయితీ

24 Jan, 2019 11:28 IST|Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ జమ్మలమడుగు పంచాయితీ సద్దుమణగడం లేదు. ఏకంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఈ వ్యవహారానికి తెరపడలేదు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ తమకే కేటాయించాలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలను పిలిచి చంద్రబాబు మాట్లాడారు. ఒకరిరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా పోటీ చేయాలని రాజీ ఫార్ములాను చంద్రబాబు సూచించారు.

అయితే, ఈ మేరకు రాజీపడటానికి ఆదినారాయణరెడ్డిగానీ, రామసుబ్బారెడ్డిగానీ అంగీకరించలేదు. చంద్రబాబు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఇద్దరు నేతలు ఆయన మాటను వినిపించుకోలేదని తెలుస్తోంది. జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి మొగ్గు చూపుతున్నారు. జమ్మలమడుగు టికెట్‌ వదులుకుంటే కడప ఎంపీగా పోటీచేసే అవకాశం ఇస్తానని, కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోతే.. ఎమ్మెల్సీ పదవీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎంత నచ్చజెప్పినా కడప నుంచి పోటీచేసేందుకు ఇద్దరు నేతలూ ముందుకు రాలేదు.

మరిన్ని వార్తలు