‘బీజేపీ ఆఫర్‌ బాగా నచ్చింది’

26 Jul, 2019 15:28 IST|Sakshi

తిరువనంతపురం : చంద్రుడిపై హోటల్‌ రూం బుక్‌ చేస్తే తాను తప్పక అక్కడికి వెళ్తానంటూ మలయాళ దర్శకుడు అదూర్‌ గోపాలకృష్ణన్‌ బీజేపీ అధికార ప్రతినిధి గోపాలకృష్ణన్‌కు కౌంటర్‌ ఇచ్చారు. దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై మతం ఆధారంగా జరుగుతున్న మూకహత్యలు, హింసాత్మక ఘటనలపై సినీ ఇండస్ట్రీతో పాటు వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జై శ్రీరాం నినాదం పేరిట దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వీరిలో అదూర్‌ గోపాలకృష్ణన్‌ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో లేఖ విషయంపై స్పందించిన బీజేపీ నేత బి.గోపాలకృష్ణన్‌... జై శ్రీరాం అనే పదం వినపడకూడదని భావిస్తే చంద్రుడిపైకి వెళ్లి జీవించాలంటూ అదూర్‌ గోపాలకృష్ణన్‌కు సూచించారు. వెంటనే శ్రీహరికోటకు వెళ్లి చంద్రయాత్రకు తన పేరు నమోదు చేసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై స్పందించిన అదూర్‌ గోపాలకృష్ణన్‌...‘ బీజేపీ వాళ్లు ఇచ్చిన ఆఫర్‌ నాకు బాగా నచ్చింది. ప్రపంచం మొత్తం చుట్టివచ్చాను. చంద్రుడిపైకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నాను. నాకోసం ఒక టికెట్‌ బుక్‌ చేయండి. అదే చేత్తో హోటల్‌ రూం కూడా’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా మూకహత్యలపై ప్రధానికి ప్రముఖులు రాసిన లేఖపై కంగనా రనౌత్‌, ప్రసూన్‌ జోషి తదితర 62 మంది సినీ ప్రముఖులు ఘాటుగా స్పందించారు. రాజకీయ దురుద్దేశంతోనే వారు లేఖ రాశారంటూ విమర్శించారు. ఈ మేరకు వాళ్లు కూడా ఓ లేఖ విడుదల చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌ పొలిటికల్‌ ట్విస్ట్‌: అమిత్‌ షా ప్రతీకారం!

తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం

ట్రంప్‌ అబద్ధాన్ని మోదీ నిజం చేశారు 

‘కే’ మాయ

ఎట్టకేలకు యడియూరప్ప కేబినెట్‌

కేటీఆర్‌కు నడ్డా ఎవరో తెలియదా?

నరసరావుపేట పరువు తీసేశారు...

మేనల్లుడి వ్యాపారంతో సంబంధం లేదు: ముఖ్యమంత్రి

‘తెలంగాణలో మానవ హక్కులు లేవా..?’

త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ : గౌతమ్‌రెడ్డి

‘టీడీపీ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం’

‘ప్రపంచంలో ఇలాంటి స్పీకర్‌ మరొకరు ఉండరు’

కశ్మీర్‌పై చేతులెత్తేసిన ప్రతిపక్షం

‘ఇందూరుకు నిజామాబాద్‌ పేరు అరిష్టం’

చేసిన తప్పు ఒప్పుకున్న కోడెల..!

రాయ్‌బరేలి రాబిన్‌హుడ్‌ కన్నుమూత

‘ప్రజలు బలైపోయినా బాబుకు ఫరవాలేదట..’

యడ్డీ కేబినెట్‌ ఇదే..

రాజీవ్‌కు ‍ప్రధాని మోదీ, సోనియా నివాళి

నిజమైన నాయకుడిని చూస్తున్నా: ఎమ్మెల్సీ

బాబు ఇల్లు మునిగితే.. సంతాప దినాలా! 

భారీ వరదలను సమర్థంగా ఎదుర్కొన్నాం

ఎమ్మెల్సీలు.. ఏకగ్రీవం

ఉలికిపాటెందుకు? 

నడ్డా.. అబద్ధాల అడ్డా 

కవితను అడిగితే తెలుస్తుంది బీజేపీ ఎక్కడుందో!

‘డ్రోన్‌ తిరిగింది బాబు కోసం కాదు..’

మంగళవారం మంత్రివర్గ విస్తరణ

‘వరదలను సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు’

జేపీ నడ్డా పచ్చి అబద్ధాలకు అడ్డా : కేటీఆర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌

‘శివ’ గురించి బాధ పడుతున్నా..

సైరాలో సూపర్‌స్టార్‌?

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

ఆయన పిలిచారు.. నేను వెళ్లాను