‘ఇప్పుడు వెళ్తున్నా.. త్వరలోనే మళ్లీ వస్తా’

20 Jul, 2019 15:33 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ సోన్‌భద్ర జిల్లాలో జరిగిన కాల్పుల్లో మరణించిన వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీని మధ్యలోనే అడ్డుకొని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రియాంకను అరెస్ట్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. బాధితులను కలిసేంతవరకూ తాను వెనుతిరిగేది లేదని ప్రియాంక స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు ప్రియాంక ధర్నాకు దిగిన చునార్‌ అతిథి గృహం వద్దకు తరలి వచ్చారు.

ఈ సందర్భంగా బాధితులను ఉద్దేశిస్తూ.. ప్రియాంక మాట్లాడారు. ‘బాధిత కుటుంబాలకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. వారిని కలవాలన్న నా లక్ష్యం నెరవేరింది. చనిపోయిన వారి కుటుంబాలకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున రూ. 10లక్షల ఆర్థిక సాయం అందజేస్తాం’ అన్నారు. ఇదిలా ఉండగా ప్రియాంకను అదుపులోకి తీసుకోవడం గానీ, అరెస్ట్‌ చేయడం గానీ చేయలేదన్నారు మిర్జాపూర్‌ డీఎం. ఇప్పుడు ప్రియాంక ఎక్కడికైనా వెల్లవచ్చని ఆయన తెలిపారు. అయితే డీఏం వ్యాఖ్యల పట్ల ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి తనను అడ్డుకున్న పోలీసులు.. ఇప్పుడు తనను అరెస్ట్‌ చేయలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. బాధితుల్ని పరామర్శించిన తాను ఇప్పటికి వెళ్లి పోతున్నానని... కానీ త్వరలోనే తిరిగి వస్తానని ప్రియాంక స్పష్టం చేశారు.

మమ్మల్నీ అడ్డుకున్నారు..
సోన్‌భద్ర బాధిత కుటుంబాలను పరామర్శించడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత డెరెక్‌ ఓ బ్రియెన్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం కోల్‌కతా నుంచి బయలుదేరింది. అయితే తమను వారణాసి పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నట్లు డెరెక్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దాంతో వారు విమానాశ్రయ ఆవరణలోనే నిరసనకు దిగారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కార్యకర్త నుంచి కడవరకూ కాంగ్రెస్‌లోనే

ఎగిరే పార్టీకాదు.. నిలదొక్కుకునే పార్టీ..

రాజకీయాలు చేసేందుకే ప్రియాంక అక్కడకు..

‘ఎవరిని అడిగినా చెప్తారు.. తుగ్లక్‌ ఎవరో’

గెస్ట్‌హౌస్‌లో ప్రియాంక.. కరెంట్‌, వాటర్‌ కట్‌!

ఆజం ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

ఉన్న పరువు కాస్తా పాయే..!

ఆయన డెస్క్‌ మీద.. తలకిందులుగా జాతీయ జెండా!

మున్సిపల్‌ చట్టం.. బీసీలకు నష్టం

కమలంలో కలహాలు...

ప్రియాంక గాంధీ అరెస్ట్‌!

గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి

పోలవరం పూర్తి చేసే సత్తా మాకే ఉంది

పాతవాటికే పైసా ఇవ్వలేదు.. కొత్తవాటికి ఏమిస్తారు?

మీ మైండ్‌సెట్‌ మారదా?

సంచలన ఎంపీపై పరువునష్టం దావా

ప్రియాంక గాంధీ అయితే ఓకే..

కర్ణాటక అసెంబ్లీ సోమవారానికి వాయిదా

కండీషన్స్‌ లేకుండా బీజేపీలో చేరుతా..

పార్లమెంట్‌ సమావేశాలు మూడు రోజులు పొడగింపు!

కర్ణాటకం : విశ్వాస పరీక్షకు మరో డెడ్‌లైన్‌

చిరంజీవి మమ్మల్ని సంప్రదించలేదు..

ప్రియాంక గాంధీని అడ్డుకున్న అధికారులు..!

ప్రతిపక్షం తీరు కుక్కతోక వంకరే: సీఎం జగన్

‘కర్నాటకం’లో కొత్త మలుపు

‘షరతులకు లోబడి లేకపోతే చర్యలు’

‘అప్పటి నుంచి మైండ్‌ మరింత దెబ్బతిన్నట్టుంది’

యడ్యూరప్ప చేతులు జోడించి వేడుకున్నారు కానీ..

పోలవరంపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌