‘అగ్రిగోల్డ్‌ ఆస్తులను టీడీపీ నేతలు కొల్లగొడుతున్నారు’

22 Nov, 2018 19:34 IST|Sakshi

సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను చంద్రబాబు పక్కన పెట్టాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. టీడీపీ నాయకులు అగ్రిగోల్డ్‌ ఆస్తులను చౌకబేరంగా కొల్లగొడుతున్నారని ఆరోపించారు. గురువారం 16వ ఏఐటీయూసీ మహాసభలను కర్నూలులో ఆయన ప్రారంభించారు. ఏఐటీయూసీ నాయకులు కర్నూలు నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. రానున్న 2019 ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలు మహాకూటమిగా పోటీ చేస్తాయని తెలిపారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు