స్టాంపు పేపర్‌పై మేనిఫెస్టో

11 Nov, 2018 03:32 IST|Sakshi
అజిత్‌ జోగి విడుదలచేసిన మేనిఫెస్టో ఇదే

నెరవేర్చకుంటే జైలుకెళ్తా: అజిత్‌ జోగీ

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జేసీసీ) పార్టీ అధినేత అజిత్‌ జోగీ ఎన్నికల మేనిఫెస్టోను వినూత్నరీతిలో తెచ్చారు. రూ.100  స్టాంపు పేపర్‌పై పార్టీ హామీలను ముద్రించారు. ఇది తన ప్రమాణ పత్రమనీ, గెలిస్తే ఈ హామీలన్నీ నెరవేరుస్తాననీ, ఓడితే జైలుకైనా వెళ్తానని జోగీ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ల మేనిఫెస్టోలకు చట్టబద్ధత లేదనీ, ఆ పార్టీల మేనిఫెస్టోలు చిత్తు కాగితాలన్నారు.

బాండు పేపర్‌పై మొత్తం 14 హామీలను జోగీ ముద్రించారు. రాష్ట్రంలో జన్మించే ప్రతీ ఆడబిడ్డ పేరిట లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్‌ చేయడం, ఇళ్లు, స్థలాల అసలైన హక్కుదారులకు పట్టాలు ఇవ్వడం, జీఎస్టీతోపాటు ఇంధనంపై పన్నులనూ సగానికి తగ్గించడం, ఒక్కొక్కరికి రూ.7 లక్షల రూపాయల విలువైన ఆరోగ్య బీమా, రిజర్వేషన్లను ప్రభుత్వ రంగంలో వంద శాతానికి, ప్రయివేటు రంగంలో 90 శాతానికి పెంపు తదితర హామీలు వాటిలో ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు