నిర్మల్‌ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్‌ ఒవైసీ

10 Dec, 2019 14:13 IST|Sakshi

సాక్షి, నిర్మల్: గతంలో హిందూ దేవతలపై  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ మంగళవారం నిర్మల్‌ కోర్టుకు హాజరయ్యారు. నిర్మల్‌లోని ఓ సభలో మాట్లాడుతూ హిందూ దేవతలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నిర్మల్‌లో కేసు దాఖలైంది. ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన అక్బర్‌..  కేసును హైదరాబాద్‌ కోర్టుకు బదిలీ చేయాలని న్యాయమూర్తిని కోరారు. నిర్మల్‌ కోర్టుకు అక్బర్‌ రావడంతో ఎంఐఎం కార్యకర్తలు, మైనారిటీలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. దీంతో నిర్మల్ కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు