జగన్‌ విజయం సాధించాలని.. ఆకేపాటి పాదయాత్ర

22 Jan, 2018 09:45 IST|Sakshi

ఎంపీ మిథున్‌రెడ్డి

రైల్వేకోడూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజయం చేకూర్చడం కోసం ఆకేపాటి చేపట్టిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్టీమెంటరీ జిల్లా అధ్యక్షుడు  ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నమయ్య కాలిబాట ద్వారా తిరుమలకు చేపట్టిన 15వ మహాపాదయాత్ర ఆదివారం రైల్వేకోడూరు పట్ట ణానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి ఎంపీ  ఘనంగా స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలే తన సమస్యలుగా భావిస్తున్న జగనన్నకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలమన్నారు.

అందులో భాగంగానే ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయం కావాలని తన వంతుగా ఆకేపాటి పాదయాత్ర చేపట్టడం శుభపరిణామం అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆకేపాటి శ్రీవారిని కోరుకోవాలన్నారు. అనంతరం ఆకేపాటి మాట్లాడుతూ ఏడు కొండల వాడి దయతో జగనన్న ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయం అవుతుందని అన్నారు. శ్రీవారి కరుణ కటాక్షాలతో ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. తాను పాదయాత్ర ద్వారా జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఏడుకొండల వారిని కోరుకుం టానని అన్నారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటువంటి పాదయాత్రల ద్వారా ఇటు ఆధ్యాత్మికతతోపాటు ప్రజా సమస్యలు తెలుసుకోగలరని అన్నారు.

సంఘీభావం: రైల్వేకోడూరు మండలంలోని బాలపల్లెలో ఆదివారం సాయంత్రం పాదయాత్ర చేస్తున్న ఆకేపాటిని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కలిసి సంఘీభావం తెలిపి ఆయనను పూలమాలతో సత్కరించారు. అనంతరం వివేకానందరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఎలుగెత్తేందుకు జగన్‌మోహన్‌రెడ్డికి శ్రీ వెంకటేశ్వరుడు అమితమైన శక్తిని ప్రసాదించాలని ఆకేపాటి కోరాలన్నారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ స్వ ప్రయోజనాల కోసం రాష్ట్ర అవసరాలను ఫణంగా పెట్టిన చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ జగనన్న ప్రజా సంకల్పయాత్రకు మద్దతు తెలపాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు పంజం సుకుమార్‌రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డి, సీహెచ్‌ రమేష్, మందల నాగేంద్ర, పి.భరత్‌రెడ్డి, గీతాల నరసింహా రెడ్డి, ఎంవీ రమణ, కరిముల్లా, సి.జయరామిరెడ్డి, రవీంద్రనాయుడుతోపాటు నందలూరు, చిట్వేలి, పుల్లంపేట, పెనగలూరు, ఓబులవారిపల్లె, కోడూరు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు