బాబు వ్యాఖ్యల్ని ఖండించిన బ్రాహ్మణ సంఘాలు

12 Apr, 2019 21:52 IST|Sakshi
ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షులు ద్రోణంరాజు రవి కుమార్‌(పాత చిత్రం)

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను బ్రాహ్మణ సంఘాలు ఖండించాయి. సీఎస్‌గా ఉన్న ఎల్‌వీ సుబ్రహ్మణ్యంపై సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి విమర్శలు చేయడం సరైంది కాదని ఆల్‌ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు ద్రోణం రాజు రవి కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఎల్‌వీ సుబ్రహ్మణ్యంపై ఉన్న కేసులను హైకోర్టు 2018 జనవరిలోనే కొట్టేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకి వస్తాయని చెప్పారు.

ప్రతిపక్ష నేత కొంతమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు చేస్తోన్న తప్పులను ఎత్తిచూపినపుడు ఇదే ఎల్వీ సుబ్రహ్మణ్యంతో మీరు మాట్లాడించలేదా అని సూటిగా ప్రశ్నించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగుజాతి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమే అవుతోందని వ్యాక్యానించారు. గతంలో కూడా అనేక సందర్భాలలో సీఎస్‌లు డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల విధులను పర్యవేక్షించారని గుర్తు చేశారు. సీఎస్‌ డీజీపీ కార్యాలయానికి వెళ్లడమనేది ఎన్నికల ప్రక్రియలో ఒక భాగమన్నారు.

మరిన్ని వార్తలు