డీఆర్సీ సమావేశాలకు లోకేష్‌ను ఆహ్వానించం

23 Nov, 2019 17:14 IST|Sakshi

సాక్షి, గుంటూరు : గుంటూరులో ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో శనివారం డీఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనందకుమార్‌,ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఆర్సీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి జిల్లాలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు, డీఆర్‌సీ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ను పిలవకూడదని ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పై నారా లోకేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం పై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాలకు లోకేష్‌ను బహిష్కరించాలని ఎమ్మెల్యే ఆర్కే ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అంతకు ముందు జిల్లాలో చేపట్టాల్సిన వ్యవసాయం, సాగు, తాగు నీరుకు సంబంధించి పలు కీలక అంశాలు చర్చించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ముందుచూపు లేని మోదీ సర్కారు

ఏడాది కింద కరోనా వచ్చుంటేనా..

నా సొంత ఖర్చుతో ఏర్పాటు చేశా.. టీడీపీపై ఫైర్‌

మతమౌఢ్యం తలకెక్కిన ఉన్మాది ఒవైసీ..

మోదీ పిలుపు; నిద్రొస్తే నిద్రపోతా : మమతా 

సినిమా

కరోనా పాజిటివ్‌.. 10 లక్షల డాలర్ల విరాళం!

సంవ‌త్స‌ర జీతాన్ని వ‌దులుకున్న ఏక్తాక‌పూర్‌

అమ్మ మాట్లాడిన తీరు చూస్తే భయమేసింది: సైఫ్‌

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

మానవత్వం మరచిన తారలు