అన్నా డీఎంకే, పీఎంకేలతో బీజేపీ దోస్తీ

20 Feb, 2019 00:38 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో కలసిపోటీచేయాలని అధికార అన్నా డీఎంకే, బీజేపీ, పట్టాలి మక్కల్‌ కచ్చి(పీఎంకే) పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు మంగళవారం మూడు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. మరిన్ని తమిళ పార్టీలు ఈ కూటమిలో చేరే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 5 చోట్ల, పీఎంకే 7 స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి. ఇతర మిత్రపక్షాలు కూడా ఖరారైన తరువాత అన్నా డీఎంకే ఎన్ని సీట్లలో పోటీచేస్తుందో స్పష్టత వస్తుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

తొలుత పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్, ఆయన కొడుకు అన్బుమణి రామదాస్‌తో సమావేశమై చర్చలు జరిపిన సీఎం పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఆ తరువాత కేంద్ర మంత్రి, తమిళనాడు బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి పీయూష్‌ గోయల్‌ నేతృత్వంలోని బృందంతో భేటీ అయి వేర్వేరుగా ఒప్పందం చేసుకున్నారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి(1 లోక్‌సభ స్థానం)లోనూ ఈ కూటమి కొనసాగుతుందని తెలిపారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీలోని 21 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో అన్నా డీఎంకేకు మద్దతు ఇచ్చేందుకు బీజేపీ, పీఎంకే అంగీకరించాయి.

విజయ్‌కాంత్‌కూ ఆహ్వానం? 
అంతకుముందు, గోయల్‌.. డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌తో సమావేశం కావడంతో ఆ పార్టీ కూడా ఈ కూటమిలో చేరే అవకాశాలున్నట్లు ఊహాగానాలొచ్చాయి. తమ మెగా కూటమి విజయం సాధిస్తుందని పన్నీర్‌ సెల్వం ఆశాభావం వ్యక్తం చేశారు.  తమిళుల హక్కుల సాధన కోసం పది డిమాండ్లను లేవనెత్తామని, అందులో కావేరి డెల్టాను రక్షిత వ్యవసాయ జోన్‌గా ప్రకటించడం, రాష్ట్రంలో కుల     ఆధారిత జనగణన నిర్వహించడంలాంటివి ఉన్నాయని రామదాసు చెప్పారు.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైఎస్‌ జగన్‌ పర్యటన.. కేబుల్‌ ప్రసారాలు నిలిపివేత

నిన్న విజయవాడ... ఇప్పుడు గన్నవరమా?

‘ఏప్రిల్‌ 11న టీడీపీ జ్యోతి ఆరిపోతుంది’

రాయపాటిపై ఫైర్ అవుతున్న కోడెల

రైతన్న మొహంలో చిరునవ్వు చూస్తా : వైఎస్‌ జగన్‌

‘పవన్‌ కల్యాణ్‌ ఓ పొలిటికల్‌ బ్రోకర్‌’

బీఎస్పీలో రగడ.. యూపీ నేతలకు ఇక్కడేం పని..?

మద్య రక్కసిపై జగనాస్త్రం

అవినీతిలో చంద్రబాబుది ‘గిన్నిస్‌’ రికార్డు 

వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నా : సినీ నిర్మాత

అసలు నీ ఊరెక్కడా.. ఏం మాట్లాడుతున్నావ్‌..!

అందుకే నా భార్యతో నామినేషన్‌ వేయిస్తా : గోరంట్ల

వైఎస్‌ జగన్‌ను కలిసిన కొత్తపల్లి

అందరివాడు..అందనివాడు

బుజ‍్జి నామినేషన్‌కు రండి.. 1000 పట్టుకెళ్లండి

తండ్రి స్థానం నుంచి తనయుడు పోటీ

‘మోదీ.. బీఫ్‌ బిర్యానీ తిని పడుకున్నావా’

బలహీన వర్గాలకే ప్రాధాన్యం

‘రిజల్ట్ చూసి మీ గుండెలు పగిలిపోతాయి’

తెలంగాణలో పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ

వైరల్‌ : లోకేష్‌.. పసుపు కుంకుమ మాకు రాలే!

పుష్కరాలంటూ..రోడ్డున పడేశారు

మహ్మద్‌ ఘోరి V/S ఫక్కర్‌ రామాయని@17..

కాంగ్రెస్‌ది తాత్కాలిక ముచ్చటే.. పుల్వామాతో మారిన సీన్‌..

వ్యాపారులకు నాయకుడి శఠగోపం

యూపీలో అను''కులం''... బువా–భతీజాకే!

ధన ప్రవాహం @110

ఎన్నికల చట్టాలు ఇవే..  ఉల్లంఘిస్తే శిక్షే

సంక్షేమం.. అధికార పక్షం!

కాంగ్రెస్‌కు దూరంగా కార్తీకరెడ్డి! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శింబుతో సెట్‌ అవుతుందా?

ఎంట్రీతోనే ఇద్దరుగా..!

దగ్గుబాటి కల్యాణ వైభోగమే...

నెక్ట్స్‌ ఏంటి?

బిజీ బిజీ

స్టైలిష్‌ రాయుడు