తెలంగాణలో కూటమి గెలుపు ఖాయమైంది

4 Nov, 2018 02:16 IST|Sakshi

గూడూరు నారాయణరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డిసెంబర్‌ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాకూటమి విజయం ఖాయమైందని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‌లో ఆయ న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియంత పోకడలతో పాలన సాగించే ప్రభుత్వా ల గద్దె దింపడమే కాంగ్రెస్‌ సిద్ధాంతమని, ఈ ఎన్నికల్లోనూ అదే వ్యూహంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. గతంలో ఇతర పార్టీలతో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ పెట్టుకున్న పొత్తుల గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసునని, ఇప్పుడు ఎంఐఎం తో పొత్తు పెట్టుకున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారన్నారు.

చంద్రబాబు రాహుల్‌గాం« దీని కలిస్తే గుంటనక్క, ముసలినక్క అని మాట్లాడుతున్న కేసీఆర్‌ తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల కుటుం బాల సంక్షేమం కోసం రూ.5కోట్లు కూడా ఇవ్వని కేసీఆర్‌.. అమరావతికి రూ.100 కోట్లు ఇద్దామనుకున్నామని చెప్పడం ఆచరణ సాధ్యం కాని హామీలివ్వడమేనన్నారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ కీలక నేత కాంగ్రెస్‌లో చేరుతారని ఆయన ద్వారా 2, 3 జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లనుందని గూడూరు చెప్పారు.

>
మరిన్ని వార్తలు