వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి బన్నీ విషెస్‌

6 Apr, 2019 19:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల శాసనసభ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి బెస్ట్‌ విషెస్‌ తెలుపుతూ శనివారం బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖను ఉంచారు. ‘నా మిత్రుడు రవి నంద్యాల ఎమ్మెల్యే బరిలో నిలువడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు శుభాకాంక్షలు.  అతన్ని ప్రజాసేవలో చూడటం నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఆయన  చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితునిగా ఉన్నారు. మెరుగైన సమాజం నిర్మించడంలో ఆయన నాయకత్వం ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాను. రాజకీయంగా మా ఇద్దరి దారులు వేరు అయినప్పటికీ.. నేను నా స్నేహితుని నూతన ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాన’ని బన్నీ పేర్కొన్నారు.

కాగా, శుక్రవారం రోజున బన్నీ జనసేన తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నాగాబాబుకు మద్దతు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాము ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనకపోయినా.. మోరల్‌గా ఎప్పుడూ నాగబాబు వెంట ఉంటామని ఆయన పేర్కొన్నారు. అయితే నిన్న నాగబాబుకు మద్దతు తెలిపిన బన్నీ.. నేడు రవిచంద్రారెడ్డికి అభినందనలు తెలుపుతూ పోస్ట్‌ చేయడం గమనార్హం.

BEST WISHES TO SILPA RAVI REDDY GARU

A post shared by Allu Arjun (@alluarjunonline) on

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు