‘ఆ భూములు అనుకూలం కాదని ముందే చెప్పాం’

13 Jan, 2020 13:45 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : అన్ని ప్రాంతాల్ని సమానంగా అభివృద్ధి చేయాలని రాజధాని ప్రాంత రైతులు కోరుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికార వికేంద్రీకరణ దిశగా నడిపించమని, వెనుకబడిన ప్రాంతాలతో పాటు తమ ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని రాజధాని ప్రాంత రైతులు, కూలీలు కోరుతున్నారని తెలిపారు. తమ భూముల తీసుకొని చంద్రబాబు మోసం చేశాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. దళితులు భూముల్ని టీడీపీ నాయకులు బలవంతంగా లాక్కున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 
(చదవండి : రాజధాని ముసుగులో బాబు విషప్రచారం)

‘నిన్ను నమ్మి మోసపోయిన రైతులు జోలె పట్టుకొనేల చేశావు. బినామీ ఆస్తులు కాపాడు కోవడం కోసం జోలె పడుతున్నావు. హెరిటేజ్ కోసం చంద్రబాబు భార్య ప్లాటినం గాజులు చందాగా ఇచ్చారు. చంద్రబాబు పంటల్ని తగుల బెట్టించారు. బాబు, లోకేష్ జీతాలు జోలెల్లో ఎందుకు వేయలేదు. రాజధానికి అమరావతి భూముల అనుకూలం కాదని ముందే చెప్పాం.  చంద్రబాబు పోలీసుల్ని బెదిరిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగితే.. అప్పటి డీజీపీతో తప్పుడు ప్రకటన చేయించారు. 
(చదవండి : మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్‌)

వనజాక్షిపై, ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యంపై దాడి జరిగినప్పడు పోలీసు వ్యవస్థను అనుకూలంగా వాడుకున్నావు. డీజీపీ సవాంగ్‌ను ఉత్తరాది వాడు అంటున్నావు. మరి నువ్‌ పెట్టిన డీజేపీ ఏ ప్రాంతం వాడు. పోలీసులకు కులాలు మతాలు ప్రాంతాలు అంటగడుతున్నావు. సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉండగా శిబిరాలు, దీక్షలు ఎలా నిర్వహిస్తారు. రాజధానిలో శిబిరాలు, టెంట్లు ఎత్తివేయాలి. రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, అసాంఘిక శక్తులు ఉన్నారు’అని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా