సౌదీ అధికారుల పనేనంటున్న సెక్యూరిటీ చీఫ్‌

31 Mar, 2019 13:36 IST|Sakshi
అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌ (ఫైల్‌)

సాక్షి, వాషింగ్టన్‌: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌ ఫోన్‌ హ్యాక్‌కు గురైంది. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులు ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్టు సమాచారం. జెఫ్‌ బెజోస్‌ వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడానికే హ్యాకింగ్‌ జరిగినట్టు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో బెజోస్‌కు చెందిన వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికలో కాలమిస్ట్‌ అయిన జమాల్‌ ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే.

ఈ హత్యకు సౌదీ ప్రభుత్వమే కారణమంటూ వాషింగ్టన్‌ పోస్ట్‌ ప​త్రికలో అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. దీనికి ప్రతిచర్యగా బెజోస్‌ ఫోన్‌ను సౌదీ హ్యాక్‌ చేసిందని, ఆయనకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సౌదీ అధికారులు దొంగిలించారని బెజోస్‌ సెక్యూరిటీ అధికారి గవిన్‌ బెకర్‌ తెలిపారు. సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని గెవిన్‌ బెకర్‌ అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఖషోగ్గి హత్యను ప్రిన్స్‌ సల్మాన్‌ చేయించారని అమెరికా ఇంటెలిజన్స్‌ సంస్థ సీఐఏ సెనేట్‌కు సమాచారమందించింది. 

మరిన్ని వార్తలు