విపత్కర పరిస్థితుల్లో నీచ రాజకీయాలా బాబూ!

6 Apr, 2020 03:57 IST|Sakshi

చంద్రబాబు, పవన్, కన్నా లక్ష్మీనారాయణ విధానాలు ఒకేలా ఉన్నాయి. 

ఆర్థిక సాయం పంపిణీలో అవినీతి జరిగినట్లు చూపించండి 

ఆ వీడియో ఎక్కడిదో కన్నా లక్ష్మీనారాయణ బయటపెట్టాలి 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సవాల్‌

సాక్షి, అమరావతి:  కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు దేశమంతా సంఘటితంగా పోరాడుతుంటే, టీడీపీ నేతలు మాత్రం రాజకీయ విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ విధానాలు ఒకేలా ఉన్నాయని దుయ్యబట్టారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 1.33 కోట్ల మందికి రూ.1000 చొప్పున సాయం అందిస్తే దాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దారుణం అని మండిపడ్డారు. 

ఆయన ఇంకా ఏమన్నారంటే...
► రూ.1000 ఇచ్చి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలన్నట్లు ఓ వీడియోను చూపించి దుష్ప్రచారం చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ అది ఎక్కడిదో బయటపెట్టాలి. 
► 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు కింద కేంద్రం అన్ని రాష్ట్రాలతో పాటు నిధులు విడుదల చేస్తే బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ సొమ్మును పంచుతున్నారని మాట్లాడడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. 
►  2020– 21 ఏడాదికి 15వ ఆర్ధిక సంఘం రెవెన్యూ లోటు కింద రూ. 5,987 కోట్లు కేటాయించాలని సిఫార్సు చేసింది. దీనిలో భాగంగా ఏప్రిల్‌ నెలకు 491.41 కోట్లు కేటాయించారు. 15వ ఆర్ధిక సంఘం విపత్తు సహాయం నిమిత్తం రూ.1,491 కోట్లు కేటాయించి రూ.559.50 కోట్లు విడుదల చేసింది  
► కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలనేదే సీఎం లక్ష్యం.    
► సీఎం వైఎస్‌ జగన్‌ విధానాలను ప్రజలు ఆదరిస్తున్నారనే టీడీపీ కడుపుమంట.   
► ప్రజలకు సేవలందిస్తున్న డాక్టర్లు, పోలీసులు, రెవెన్యూ, శానిటేషన్‌ సిబ్బందిని అందరం గౌరవించాలి. టీడీపీ నేతలు మాత్రం ఈ పరిస్థితుల్లోనూ అడ్డగోలుగా ట్వీట్లు చేస్తున్నారు.  
► టీడీపీ కడుపు మంటతో చౌకబారు విమర్శలు చేస్తూ ప్రతి విషయాన్ని ఈసీ, గవర్నర్‌ కు ఫిర్యాదు చేస్తోంది.  

మరిన్ని వార్తలు