చంద్రబాబు అజెండా మోస్తున్న పవన్‌

5 Nov, 2019 04:44 IST|Sakshi

పవన్‌ కల్యాణ్‌ ఇక హాయిగా సినిమాలు చేసుకోవచ్చు  

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నం దున జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇక హాయిగా సినిమాలు చేసుకోవచ్చని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అవి నీతి రహిత పాలన అందిస్తున్నా ఇద్దరు మూ ర్ఖుల మనసులను రంజింపజేయలేమని అన్నా రు. చంద్రబాబు జెండా, అజెండాను మోయడం మాని, సొంత సిద్ధాంతం, ఆలోచనతో రాజకీయాలు చేయాలని పవన్‌ కల్యాణ్‌కు హితవు పలికారు.

సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో రాంబాబు మీడియాతో మాట్లాడారు. తాట తీస్తానంటూ పవన్‌ కల్యాణ్‌ బీరాలు పలుకుతున్నారని, ఇప్పటికే రెండుచోట్ల ప్రజలు ఆయన తాట తీశారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఈ మీటింగ్‌ పెట్టింది భవన నిర్మాణ కార్మికుల కోసమా? లేక ఐదు నెలలపాటు పవన్‌ కల్యాణ్‌ను, చంద్రబాబును విమర్శించిన వారికి సమాధానం చెప్పడానికా? అర్థం కావడం లేదన్నారు.
 
మాకు టైమిచ్చే సామర్థ్యం పవన్‌కు ఉందా?  

ఎంపీ విజయసాయిరెడ్డిపై, మంత్రులపై, ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా విమర్శల దాడులు చేయడం రాజకీయాల్లో ధర్మమేనా అని అంబటి ప్రశ్నించారు. కాకినాడ వెళ్లి మంత్రి కన్నబాబును ఓడించాలని కోరితే ప్రజలు పవన్‌ను  తుక్కుతుక్కుగా ఓడించారని అన్నారు. విజయసాయిరెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల నిధికి చెందిన రూ.1,343 కోట్లలో కేవలం రూ.412 కోట్లు మాత్రమే చంద్రబాబు హయాంలో ఖర్చుపెట్టారని, మిగిలిన నిధులను పసుపు–కుంకుమ, ఇతర పథకాలకు మళ్లించా రని గుర్తు చేశారు.

ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్న పవన్‌ కల్యాణ్‌ ఆ రోజు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేకపోయారని నిలదీశారు. తమకు టైం ఇచ్చే సామర్థ్యం పవన్‌కు ఎక్కడిదని అన్నారు. అమ రావతికి నడిచి వస్తానన్న పవన్‌.. కరకట్టపై నడిచి ఆయన చంద్రబాబు అక్రమంగా నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ను పరిశీలించి, చంద్రబాబును నిలదీయాలని సూచించారు.    

మరిన్ని వార్తలు