పవన్‌ సార్థక నామధేయుడు : అంబటి

5 Dec, 2019 17:07 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సార్థక నామధేయుడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్‌ తన పేరులోని పవనం, కల్యాణం రెండు పదాలకు న్యాయం చేశారని అంబటి వ్యాఖ్యానించారు. పవనం అంటే గాలి అని.. ఇవాళ పవన్‌ గాలి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాజధానిపై ఏనాడూ ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరపని విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబుకు ఓడిపోయిన తరువాత ప్రతిపక్షాలు గుర్తొచ్చాయని ఎద్దేవా చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

రాజధానిలో రెండు తాత్కాలిక బిల్డింగ్‌ నిర్మించి.. అద్భుతం సృష్టించినట్టు చంద్రబాబు భ్రమలు కల్పించారని ఎద్దేవా చేశారు. ఆయన బినామీలకు నష్టం జరుగుతుందనే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇటీవల రాజధాని ప్రాంతంలో పర్యటిస్తే ఏం జరిగిందో అందరికి తెలుసని చెప్పారు. రాజధాని ప్రాంత ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించిన చంద్రబాబుకు బుద్ధి రాలేదని విమర్శించారు. రాజధానిపై కచ్చితమైన వాస్తవాలు చెప్పేందుకు తమ ప్రభుత్వం ప్రయతిస్తోందని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీపై చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని అంబటి ఖండించారు. 

పిట్టలదొర, తుపాకీరాముడును మరపించేలా..
పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబుకు రహస్య మిత్రుడిగా ఉన్నాడని విమర్శించారు. పవన్‌ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారని.. ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గుర్తించకుంటే వచ్చే నష్టమేమి లేదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, పవన్‌ కలిసి పోటీ చేస్తే ప్రజలు కట్టకట్టి విసిరేసేవారని అన్నారు. ఎందుకు ఎగిరేగిరి పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. లాంగ్‌ మార్చ్‌ అని రెండు కిలోమీటర్లు నడవలేని పవన్‌.. గాలి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు పిట్టలదొర, తుపాకీరాముడును మరపించేలా ఉన్నాయని అన్నారు.

గతంలో క్రిస్టియన్‌ మతం గురించి గొప్పగా చెప్పిన పవన్‌.. ఇప్పుడు మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. గతంలో బాప్టిస్టు మతం తీసుకున్నానని చెప్పిన పవన్‌.. తిరుమల వెళ్లినప్పుడు డిక్లరేషన్‌ తీసుకున్నారా అని ప్రశ్నించారు.  పవన్‌ తాను చేగువేరా వాసరుడని అంటారని, అదే విధంగా హోం మంత్రి అమిత్‌ షా అంతా గొప్పవారు లేరని అంటారని.. ఆయన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదన్నారు. పవన్‌కు స్థిరత్వం లేదని విమర్శించారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవి.. బోర్లాపడవద్దని పవన్‌కు సూచించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వాళ్లంతా స్వాతంత్ర్య సమరయోధులు కాదు

వారి సూచనల మేరకే రాజధాని: బుగ్గన

చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే శ్రీదేవి

జంగారెడ్డిగూడెంలో టీడీపీకి షాక్‌!

‘అందరూ స్వాగతిస్తే.. చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు’

తమిళనాడులో బీజేపీకి భారీ షాక్‌

‘పీవీపై మన్మోహన్‌ వ్యాఖ్యలు అవాస్తవం’

ఏం మాట్లాడుతున్నాడో పవన్‌కే తెలియదు?

ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టి.. నిద్రపోయావా?

‘ఆయన టైంపాస్‌ చేస్తున్నారు’

నేను ఉల్లిగడ్డలు పెద్దగా తినను!

పార్లమెంట్‌ సమావేశాలకు చిదంబరం

పీవీ ఆ మాట వినివుంటే.. మరోలా వుండేది

చంద్రబాబుకు బీజేపీ, సీపీఎం ఝలక్‌

భరోసా ఇవ్వలేకపోయిన చంద్రబాబు..

యడియూరప్ప ప్రభుత్వానికి విషమ పరీక్ష

సీఎం జగన్‌ రాజకీయంగా పునర్జన్మనిచ్చారు!

కేసీఆర్‌ మరో గజినీలా తయారయ్యాడు: లక్ష్మణ్‌

ఇది పవన్‌ అజ్ఞానికి నిదర్శనం: దేవినేని అవినాష్‌

‘అందుకే పవన్‌ నిందితులకు మరణ శిక్ష వద్దంటున్నాడు’

‘ఎన్‌సీపీని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు’

అమిత్‌ షా ఎందుకు కరెక్టో పవన్‌ చెప్పాలి!

పవన్‌ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: పుష్ప శ్రీవాణి

‘చంద్రబాబుది.. నీరు చెట్టు దోపిడీ చరిత్ర’

రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్‌ అవుతాయా?

‘తక్షణమే హెచ్‌ఆర్‌డీ నిబంధనలు ఉపసంహరించుకోవాలి’

పవన్‌.. నీకు మైండ్‌ దొబ్బిందా: శ్రీనివాస్‌

బీజేపీలో జనసేనను విలీనం చేస్తారా?

కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దిస్‌ ఈజ్‌ ద జస్ట్‌ బిగినింగ్‌

అందుకు చాలా కష్టపడ్డాను: నటుడు

ఆన్‌లైన్‌ గ్రీకు వీరుడు హృతిక్‌!

విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టం: హీరోయిన్‌

బిగ్‌బాస్‌: కొట్టుకున్నారు.. ఆపై ఏడ్చాడు!

నగ్నంగా ఫొటో దిగడానికి తిరస్కరించిన నటి