చంద్రబాబు ఎన్ని జన్మలెత్తినా..: అంబటి

3 Jun, 2020 19:04 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ పతనం దిశగా వెళుతోందని ఆయన విమర్శించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. దేశంలో ఉన్న సీఎంలలో వైఎస్ జగన్ నాలుగో స్థానంలో ఉన్నారు. టీడీపీ నేతలే  దిగజారుడు విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు చూసి టీడీపీలో ఆందోళన మొదలైంది. చంద్రబాబు రోజు రోజుకు పతనం అవుతోంటే.. ముఖ్యమంత్రి ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఏడాది కాలంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం రూ. 40, 130 కోట్లను 3.57 కోట్ల లబ్దిదారులకు అందచేశాం. ప్రజా వ్యతిరేక పాలన చేశారు కాబట్టే ప్రజలు ఆ పార్టీకి 23 స్థానాలు ఇచ్చారు. చంద్రబాబు ఔట్ డేటెడ్ అయ్యారు. ఇక ఆయన వారసుడిగా లోకేష్ అప్‌డేట్ కాలేకపోతున్నారు. (చంద్రబాబుకి అదే స్థానం శాశ్వతం)

చంద్రబాబువి జూమ్‌ కూతలు..
చంద్రబాబు పాలనంతా దోపిడీ మయం.. వేల కోట్లు గంగలో పోశారు. ఆయన పాలనలో రూ.15 వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆ బకాయిలు తీర్చారు. చంద్రబాబు ఎన్ని జన్మలెత్తినా తిరిగి అధికారంలోకి రాలేరు. కరోనా విషయంలో 4 లక్షల టెస్టులు చేసిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అభినందించినా చంద్రబాబు మాత్రం జూమ్‌ కూతలు కూస్తున్నారు. సీ ఓటర్ సర్వేలో సీఎం జగన్ నాలుగో స్థానంలో నిలిచిన విషయం చంద్రబాబు గమనించడం లేదా..?. న్యాయస్థానాలపై మాకు అపారమైన గౌరవం ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. చంద్రబాబు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. లేక్‌వ్యూ గెస్ట్ హౌస్, హైదరాబాదులోని ఎల్ బ్లాకు కోసం చంద్రబాబు పెట్టిన ఖర్చు వసూలు చేయాలంటే చాలా ఉంటుంది. (బెస్ట్ సీఎం వైఎస్ జగన్)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా