బాబు డైరెక్షన్‌లోనే మంతనాలు : అంబటి

24 Jun, 2020 17:58 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బీజేపీ నేతలు సుజానా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో రహస్యంగా భేటీ కావడం వెనక అంతర్యమేమిటని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరక్షన్‌లోనే వారు ముగ్గురు రహస్య మంతనాలు జరిపారని చెప్పారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజ్‌ బయటకు వచ్చాకే వారిని కలిసినట్టు సుజనా ఎందుకు చెప్పారని నిలదీశారు. 13వ తేదీన భేటీ జరిగితే.. ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కలిస్తే తప్పేంటని ప్రశ్నించడం చూస్తుంటే వారు బరితెగించారని అర్థం అవుతుందన్నారు. సుజనా, కామినేనిలు బీజేపీ ముసుగులో అనైతిక పనులు చేస్తున్నారని మండిపడ్డారు.(చదవండి : హైదరాబాద్‌ స్టార్‌ హోటల్‌లో గూడుపుఠాణి!)

కాపులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే..
కాపులను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అంబటి విమర్శించారు. కాపుల పాలిట చంద్రబాబు ప్రభుత్వం రాక్షసత్వం వహించిందని గుర్తుచేశారు. చంద్రబాబు కాపులను అన్ని రకాలుగా వేధించడమే కాకుండా.. వారిపై కేసులు కూడా పెట్టారని అన్నారు. కాపుల అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కాపులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని  చెప్పారు. అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే అనేక పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో ప్రజా సంపదను దోచుకుందని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు