-

గుర్రాలు తెంచుకున్నాకే మనం మేల్కొంటామా!

12 Jul, 2020 16:14 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితిపై కాంగ్రెస్‌ అదిష్టానం తన మౌనాన్ని వీడి అసమ్మతిని అంగీకరించింది. అశోక్‌ గెహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. రాజస్థాన్‌లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా అదిష్టానం స్పందికపోవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ట్విటర్‌లో.. 'కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై ఆందోళన  చెందుతున్నాను. కట్టేసిన కొయ్యల నుంచి గుర్రాలు తెంచుకున్న​ తర్వాత మాత్రమే మనం మేల్కొంటామా' అంటూ రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ ట్వీట్‌పై స్పందించిన కాంగ్రెస్‌ నాయకుడు వివేక్‌ టాంకా ఇలాంటి ఆందోళనల వల్ల పార్టీ బలహీనపడుతుందని అంగీకరించారు. మరో కాంగ్రెస్‌ లీడర్‌ ఆల్కా లాంబా 'ఇలాంటి సమయంలో సహనమే విజయానికి కీలకం' అని పేర్కొన్నారు. 
చదవండి: రాజస్ధాన్‌ సంక్షోభం : కాంగ్రెస్‌ సర్కార్‌కు షాక్‌!

మరిన్ని వార్తలు