‘అందుకే ఆయన పోటీ చేయడం లేదు’

22 Mar, 2019 11:41 IST|Sakshi

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వాణీతో పాటు అస్సాం బీజేపీ సీనియర్‌ నాయకుడు హిమంత బిశ్వా శర్మ పేరు కూడా లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ట్రబుల్‌ షూటర్‌గా పేరు పొందిన హిమంత బిశ్వాకు టికెట్‌ కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా హిమంతకు టికెట్‌ కేటాయించకపోవడం వెనక గల కారణాలను ట్విటర్‌ ద్వారా తెలిపారు.

ఈ విషయం గురించి ఆయన ‘ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రస్తుతం హిమంత బిశ్వా శర్మ నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్‌డీఏసీ) కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అస్సాం, ఈశాన్య రాష్ట్రల్లో పార్టీని బలపర్చడం ముఖ్యం. ఈ బాధ్యతలను హిమంత బిశ్వా చక్కగా నిర్వర్తిస్తారని పార్టీ నమ్ముతుంది. అందుకే ఆయనకు టికెట్‌ కేటాయించలేదు. అస్సాం బీజేపీ శ్రేణులతో పాటు ఈశాన్య రాష్ట్రాల బీజేపీ నేతలు కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారని ఆశిస్తున్నాను. ఈ నిర్ణయం వల్ల అస్సాంతో పాటూ ఈశాన్య భారతం కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానం’టూ అమిత్‌ షా ట్విట్‌ చేశారు. ప్రస్తుతం బిశ్వా అస్సాం ఆర్థిక మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌