‘జన్‌ ఆక్రోశ్ కాదు..పరివార్‌ ఆక్రోశ్‌’

29 Apr, 2018 20:58 IST|Sakshi
అమిత్‌ షా

సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్‌ గాంధీ ఆధ్యర్యంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన జన్‌ ఆక్రోశ్‌ (ప్రజా ఆగ్రహం) ర్యాలీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తనదైన శైలిలో విమర్శలు చేశారు. అది జన్‌ ఆక్రోశ్‌ కాదని పరివార్‌ ఆక్రోశ్‌ (కుటుంబ ఆగ్రహం) అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో పెరుగుతున్న అసంబద్ధతకు ఈ ర్యాలీ నిదర్శనమన్నారు. జరిగిన ప్రతి ఎన్నికల్లో ఓడిపోయినా.. కాంగ్రెస్‌కు ఇంకా జనాక్రోశం అర్థం కాలేదంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లుకు కాంగ్రెస్‌ ఎందుకు అడ్డు పడిందని అమిత్‌ షా ప్రశ్నించారు. అధికార దాహంతో కాంగ్రెస్‌ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా ఈ రోజు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో 'జనాక్రోశ్‌ ర్యాలీ' నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు పార్టీ నేతలు ప్రధాని మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు