రాజ్యసభలో అమిత్‌ షా తొలి ప్రసంగం

5 Feb, 2018 14:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమిత్‌ షా అన్నారు. రాజ్యసభలో తొలిసారిగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెసేతర పార్టీకి ప్రజలు పూర్తి ఆధిక్యత కట్టబెట్టారని వెల్లడించారు. పూర్తి మెజారిటీ వచ్చినప్పటికీ ఎన్డీఏ భాగస్వాములతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై ఉన్న వ్యతిరేకత కారణంగానే తమ పార్టీకి ప్రజలు మద్దతు పలికారని అన్నారు.

అదే ఎన్డీఏ విజయం..
అభివృద్ధి ఫలాలను అట్టడుగు వర్గాలకు చేరువ చేయడమే అంత్యోదయ లక్ష్యమని చెప్పారు. 70 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా పేదవాడికి బ్యాంకు ఖాతా లేదంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక 31 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలు తెరిపించామన్నారు. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రాయితీలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వ విజయానికి జన్‌ధన్‌ యోజన ప్రత్యక్ష ఉదాహరణగా అమిత్‌ షా పేర్కొన్నారు.

ఆయన తర్వాత మోదీనే..
లాల్‌బహదూర్‌ శాస్త్రి తర్వాత ఆ స్థాయిలో పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోదీయేనని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కోటి 30 లక్షల మంది గ్యాస్‌ రాయితీలు వదులుకున్నారని తెలిపారు. దీనికి మరికొంత మొత్తం జోడించి ఉజ్వల యోజన పథకం రూపొందించామన్నారు. పేదలందరికీ వంటగ్యాస్‌ సిలెండర్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు సొంతింటి కల నెరవేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ముద్రా యోజన ద్వారా యువత స్వయం ఉపాధికి బాటలు వేశామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 16 గ్రామాల్లో విద్యుదీకరణ పూర్తి చేశామని వివరించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి కన్నుమూత

మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!

కేశినేని నానికి రామకృష్ణ కౌంటర్‌

‘అది సాహసోపేతమైన నిర్ణయం’

ఆజంను క్షమించే ప్రసక్తే లేదు : రమాదేవి

జమ్మూకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

‘రాజకీయం’లో అందరూ దొంగలేనా!

బీజేపీకి కుమారస్వామి మద్దతు!

ఎన్నికల వరకే రాజకీయాలు: ఎమ్మెల్యే శిల్పా

ఇంటింటికీ కాంగ్రెస్‌

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే హానికరం

అవినీతి నిర్మూలనకే ‘ముందస్తు న్యాయ పరిశీలన’

ఆదర్శనీయంగా మా పాలన

ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం

కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’

‘అది నిజంగా గొప్ప విషయం’

రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌ ఆలోచించాలి : రేవంత్‌

జనసేన ‘ఒకే ఒక్కడి’కి నో ఛాన్స్‌

‘మ‌ర‌ణశిక్ష విధించాలనేది మా అభిప్రాయం కాదు’

కర్ణాటక సీఎంగా యెడియూరప్ప

ఇది ఇక్కడితో ఆగిపోదు: సీఎం వైఎస్‌ జగన్‌

మాస్టర్‌ ప్లాన్‌ నివేదించండి 

ఆ మాట చెప్పిన ధైర్యమున్న నేత వైఎస్‌ జగన్‌

అందుకే జ్యుడిషియల్‌ బిల్లు : అంబటి 

ప్రపంచ చరిత్రలోనే ఎవరూ చేయని సాహసం

అందుకే నర‍్సాపురం వచ్చా: నాగబాబు

‘సుబాబుల్ రైతులను ఆదుకుంటాం’

స్విస్‌ చాలెంజ్‌తో భారీ అవినీతి: బుగ్గన

పేరు మార్చిన యడ్డీ.. మరి రాత మారుతుందా?

‘బీజేపీ ఆఫర్‌ బాగా నచ్చింది’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి

నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌

హాసన్‌ని కాదు శ్రుతీని!