బీజేడీ పాలనకి చరమగీతం: అమిత్‌ షా

2 Jul, 2018 08:44 IST|Sakshi
స్థానిక నేతలతో అమిత్‌ షా

భువనేశ్వర్‌ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 147 స్థానాల్లో 120కి పైగా సీట్లు సాధించాలని ఒడిశా నాయకత్వాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమిత్‌ షా ఆదివారం ఒడిషాలో పర్యటించారు. స్థానిక నాయకత్వం భువనేశ్వర్‌లో నిర్వహించిన పలు రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, జయల్‌ ఓరమ్‌, సీనియర్‌ నేతలు హరిచంద్రన్‌, కేవీ సింగ్‌ డీయోలతో సమావేశమయ్యారు. సీఎం నవీన్‌ పట్నాయక్‌ని ఓడించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు.

18 ఏళ్ల బీజూ జనతాదళ్‌ (బీజేడీ) పాలనకి చరమగీతం పాడాలని, పట్నాయక్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరుగునున్నందున అమిత్‌ షా ఒడిశాపై ప్రత్యేక దృష్టి సారించారు. గత రెండేళ్లలో ఎనిమిదోసారి రాష్ట్రంలో పర్యటించారు. ఒడిషాలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, అవీనితి రహిత పాలన పొందెందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. కాగా ఒడిశాలో ప్రస్తుతం బీజేపీకి కేవలం 10 ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది.

మరిన్ని వార్తలు