ఏపీ విభజనపై కాంగ్రెస్‌ అసత్యాలు: అమిత్‌ షా

6 Aug, 2019 18:54 IST|Sakshi
లోక్‌సభలో అమిత్‌ షా

సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 370 కారణంగా ఇన్నాళ్లు దేశానికి కశ్మీర్‌ దూరమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేశామని, 70 ఏళ్లుగా దేశం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపించామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి అమిత్‌ షా సమాధానం ఇచ్చారు. జమ్మూ కశ్మీర్‌ శాశ్వతంగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండదని, సాధారణ పరిస్థితులు నెలకొనగానే రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని తెలిపారు.

భారత్‌లో కశ్మీర్‌ అంతర్భాగమని, పీఓకే కూడా పూర్తిగా మనదేనని పునరుద్ఘాటించారు. జవహర్‌లార్‌ నెహ్రూ విధానాల వల్లే పీఓకే భారత్‌ నుంచి వెళ్లిపోయిందన్నారు. 1948లో బాలాకోట్‌ వరకు పాకిస్తాన్‌ సేనలను భారత్‌ సైన్యం తరిమికొట్టిందని, ఈ సమయంలో మన సైన్యాన్ని నెహ్రూ వెనక్కు రప్పించడంతో పీఓకే భారత్‌ అధీనం నుంచి వెళ్లిపోయిందని వివరించారు. పీఓకేను ఎలా స్వాధీనం చేసుకోవాలో తమకు తెలుసునని, పీఓకేలోని 25 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. హురియత్‌ నేతలతో ఎలాంటి చర్చలు జరపబోమని, జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలను వెనక్కు రప్పించబోమని వెల్లడించారు.

ఆరోజే చీకటి రోజు
ఏపీ విభజన గురించి సభలో కాంగ్రెస్‌ నేతలు అసత్యాలు చెప్పారని ధ్వజమెత్తారు. ఏపీ విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించినా పార్లమెంట్‌ ముందుకు తెచ్చారని గుర్తు చేశారు. ఏపీ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును సభలో ఎలా ప్రవేశపెట్టారని కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నించారు. తలుపులు మూసి, లైవ్‌ ప్రసారాలు లేపేసి విభజన బిల్లును పార్లమెంట్‌లో పాస్‌ చేశారని.. ఆ రోజే కాంగ్రెస్‌ చేసింది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని సమాధానమిచ్చారు. ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం ముస్లింలకు నష్టం చేకూరుస్తుందని అసత్య ప్రచారం చేస్తున్నారని, జమ్మూ కశ్మీర్‌ అన్ని మతాలకు చెందినదని అన్నారు. ఆర్టికల్‌ 370ని 371తో పోల్చవద్దని, ఇవి రెండూ వేర్వేరని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ సాహోసోతపేతమైన నిర్ణయం తీసుకున్నారని, తమ ప్రభుత్వం ఎవరికీ భయపడదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విధానాలకు అనుగుణంగా ముందుకెళుతున్నామని.. దేశ ప్రయోజనాలు, జాతి సమగ్రత కోసం నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ఏపీ, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలు భయపడాల్సిన అవసరం లేదని భరోసాయిచ్చారు. కేంద్రం ఇచ్చే నిధులకు ఇన్నాళ్లు ఆర్టికల్‌ 370 అడ్డుపడిందని, జమ్మూ కశ్మీర్‌లో ఇక నుంచి 106 కేంద్ర చట్టాలు అమలవుతాయన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టికల్‌ 370 రద్దు; ఒవైసీ కామెంట్స్‌

‘మోదీ, షా కూడా నెహ్రూలా ఆలోచించేవాళ్లే..’

ఆర్టికల్‌ 370 రద్దు; మాకు పాఠాలు చెప్పొద్దు

ముగిసిన ప్రధాని మోదీ-సీఎం జగన్‌ భేటీ

మీడియా ఎదుట ఫరూక్‌ భావోద్వేగం..!

పీఓకేపై కేంద్రం వైఖరేంటి?

‘ఫరూక్‌ను నిర్భందించలేదు’

‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం’

డెమోక్రసి గుండెల్లో 370 బుల్లెట్‌!

‘నల్లమలను లూటీ చేయాలని చూస్తున్నారు’

ఒకే దేశం, ఒకే జెండా నినాదం మంచిదే: వైఎస్సార్‌సీపీ ఎంపీ

ఆర్టికల్‌ 370 రద్దు; రాహుల్‌ స్పందన

అసెంబ్లీ అనుమతి లేకుండా ఎలా రద్దు చేస్తారు?

తెరపై మరోసారి చెన్నమనేని పౌరసత్వ వివాదం

కశ్మీర్‌ కోసం ప్రాణాలైనా అర్పిస్తా: అమిత్‌ షా

ఆర్టికల్‌ 370 రద్దుపై కమల్‌హాసన్‌ కామెంట్‌

కశ్మీర్‌ సమస్యను పరిష్కరించేది మోదీనే: ముఫ్తి!!

అప్‌డేట్స్‌: కశ్మీర్‌ పూర్తిగా మనదే

కశ్మీర్‌ అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్షం

చిన్నమ్మతో ములాఖత్‌

టైమ్‌ బాగుందనే..

గోడ దూకేద్దాం..!

కశ్మీరీల్లో ఆగ్రహం.. ఆందోళన!

కశ్మీర్‌ వ్యూహం వెనుక ఆ ముగ్గురు

తప్పులు చేసి నీతులు చెబుతారా?

టీ సర్కార్‌ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేస్తోంది

ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించడం దేశ ద్రోహమే

ఏపీని ఎలా విభజించారో మరిచిపోయారా?

బ్రేకింగ్‌: జమ్మూకశ్మీర్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శ్రీదేవి కల నెరవేర్చాను : బోనీ కపూర్‌

దొంగలున్నారు జాగ్రత్త!

పునర్నవి.. లేడీ టైగర్‌ : తమన్నా

న్యూ లుక్‌లో కమల్‌ హాసన్‌

రికార్డ్‌ సృష్టించిన ‘నే జా’

స్టార్ హీరోయిన్‌కి ‘బిగ్‌బాస్‌’ కష్టాలు