అసలు చంద్రబాబు రాష్ట్రంలో ఉన్నారా..?

14 Apr, 2020 19:24 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప : దేశం, సమాజం బాగుండాలంటే మే3 వరకు లాక్‌డౌన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి అంజాద్‌ బాషా పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి నుంచి బయట పడాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమని ఆయన సూచించారు. మంగళవారం జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. సామాజిక దూరంతోనే కరోనా నివారణ సాధ్యమతుందన్నారు. ముస్లిం సోదరుల వల్లే కరోనా పెరిగిందని ప్రధాని నరేంద్రమోదీకి చంద్రబాబు ఫిర్యాదు చేయడం బాధాకరమన్నారు. ‘అసలు చంద్రబాబు రాష్ట్రంలో ఉన్నారా..? కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలు తెలుసా’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కూర్చుని బాబు రాజకీయాలు చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. నిజాముద్దీన్‌కు విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం ముందే ఎలా తెలుస్తుందని,  ముందే తెలిస్తే ముస్లిం సోదరులు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. (‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’ )

కరోనా వ్యాప్తిని ఒక మతానికి, కులానికి అంటగట్టడం ఎంతవరకు సమంజసమని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా చంద్రబాబును నిలదీశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్నారని, ఒక మతానికి అపాదించడం భావ్యం కాదని నిక్కచ్చిగా తేల్చి చెప్పారన్నారు. మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం ఉందని, పాజిటివ్ వచ్చిన వారిపై జాలి చూపాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా ద్వారా ముస్లిం సోదరులపై దుష్ప్రచారం చేశారని, ఆ వీడియోలు నకిలీవి అని జాతీయ మీడియా తేల్చిందని అన్నారు. వారికి రాష్ట్ర ప్రజల తరవున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ముస్లింలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యలకు కట్టుబడి తక్షణమే ఆయన వారికి క్షమాపణ కోరారని మంత్రి గుర్తు చేశారు. ప్రజలకు క్షమాపణ చెప్పినా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేయడం దారుణమని ఖండించారు. (బంగారం నెక్ట్స్‌ టార్గెట్‌ ఇదేనా..?)

ముస్లింలపై చంద్రబాబు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని, బాబు ముస్లింల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు  ఉందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ముస్లింలకు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే దేశ ద్రోహం కేసులు నమోదు చేయడం వాస్తవమా కదా అని ప్రశ్నించారు. శవ రాజకీయాలు చేయాల్సిన సమయం ఇదేనా అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.100 అసత్యపు వార్తలను ఎల్లో మీడియా ప్రసారం చేస్తే నిజం అవుతాయా అని మండిపడ్డారు. భారతీయులమంతా ఒక తాటి పైకి వచ్చి కరోనాపై యుద్ధం చేయాల్సిన సమయమిదని పేర్కొన్నారు. లాక్‌డౌన్ కారణంగా రైతులు నష్ట పోకూడదని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చులు పెట్టొద్దని మంత్రి అంజాద్‌ బాషా హెచ్చరించారు. (లాక్‌డౌన్‌ ఉల్లంఘన: 5600 కేసులు నమోదు )

మరిన్ని వార్తలు