వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేను: మాజీ ముఖ్యమంత్రి

9 Oct, 2017 16:21 IST|Sakshi

గుజరాత్‌: రానున్ను సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయలేనని గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ ప్రకటించారు. ఈ మేరకు వయసు రీత్యా, రానున్న  అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగలేనని బీజీపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాశారు. 75ఏళ్ల వయసులో తాను పోటీ చేయలేనని, తన పరిస్థితిని లేఖలో పార్టీ  అధినేతకు వివరించారు. పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశకురాలిగా ఉంటానని ఆనందీ తెలిపారు.

దాదాపు 20ఏళ్లపాటు ఆమె ఎమ్మెల్యేగా కొనసాగారు. మితవాదిగా ఆమెకు పార్టీలో మంచిపేరుంది. అయితే తాజాగా వివాదాస్పద బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, గత వారం పార్టీలో సీనియర్‌ నేతలు బాధ్యతల నుంచి తప్పుకొని వచ్చే ఎన్నికల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆనందీబెన్‌కు సూచిస్తూ సోషల్‌ మీడియా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ 2014లో ప్రధాని అవడంతో ఆయన స్థానంలో పటేల్‌ ఆనందీబెన్‌ను ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత పటేల్‌ రిజర్వేషన్ల సాధనకు జరిగిన అల్లర్లను అదుపు చేయలేకపోవడంతో పాటు, పలు రాజకీయం కారణాలతో గత ఏడాది ఆగస్టులో పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి విజయ్‌ రూపానీ గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు