ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దు..!

27 Jan, 2020 10:22 IST|Sakshi

మండలి రద్దు తీర్మానానికి కేబినెట్‌ ఆమోదం

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన పలు కీలక బిల్లులకు అడ్డు తగులుతున్న శాసన మండలి రద్దే సరైందని మంత్రివర్గం భావించింది. ఈ మేరకు మండలి రద్దుకు సంబంధించి శాసన సభలో సోమవారం ప్రవేశపెట్టే తీర్మానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతోపాటు కేబినెట్‌ భేటీలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌, మచిలీపట్నం పోర్టులపై మంత్రివర్గం చర్చించినట్టు తెలిసింది. మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. శాసన మండలి రద్దు తీర్మానాన్ని ప్రభుత్వం కేంద్రం ఆమోదానికి పంపనుంది. (చదవండి : ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?)

⇒ ఏపీలో మండలి రద్దు కావడం ఇది రెండోసారి
⇒ శాసన మండలిని మే 31, 1985న రద్దు చేసిన నాటి సీఎం ఎన్టీఆర్‌
⇒ మార్చి 30, 2007న తిరిగి మండలి పునరుద్దరణ
⇒ 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి విడిగా శాసన మండలి

⇒ మండలి రద్దుపై తీర్మానం చేయనున్న శాసన సభ
⇒ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం
⇒ ఆర‍్టికల్‌ 169 ద్వారా ఏ రాష్ట్ర మండలినైనా రద్దు చేసే అధికారం
⇒ పార్లమెంట్‌ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో రద్దు కానున్న మండలి

⇒ ఇప్పటికే చాలాచోట్ల మండలిని పక్కనపెట్టిన రాష్ట్రాలు
⇒ దేశవ్యాప్తంగా కేవలం 6 రాష్ట్రాల్లోనే శాసన మండలి
⇒ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్‌, యూపీలోనే పెద్దల సభ
⇒ మండలిని పునరుద్దరించాలంటూ 5 రాష్ట్రాల్లో వినతులు
⇒ అసోం, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడు, బెంగాల్‌లో మండలి కోసం వినతులు
⇒ మండలి పునరుద్దరించాలన్న ఐదు రాష్ట్రాల వినతుల పట్ల కేంద్రం విముఖత
⇒ మండలి వల్ల ఆర్థికంగా రాష్ట్రంపై భారీగా భారమన్న భావనలో కేంద్రం

మరిన్ని వార్తలు