‘దోపిడీ జరిగింది వాస్తవం కాదా?’

22 Feb, 2020 11:16 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన దోపిడీపై విచారణ చేస్తే బీసీ అంటారా.. ఇదేం న్యాయమని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో కోట్లాది రూపాయాల మేర దోపిడీ చేసి.. ఇప్పుడు కులాలను తెరపైకి తీసుకువస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులు ఒక నోటీసు ఇస్తేనే తనపై ఎన్నో ఆరోపణలు చేశారని అన్నారు. అప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా అని అనిల్‌కుమార్‌ ధ్వజమెత్తారు. (కార్మికుల సొమ్ము  కట్టలపాము పాలు!)

తాము కూడా బీసీ నేతలమేనని.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు మంత్రి పదవి కూడా ఇచ్చారని అనిల్‌ కుమార్‌ గుర్తుచేశారు. అసెంబ్లీలోనే తనపై విమర్శలు చేశారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ తరహాలోనే విచారణ జరిపాలని మాత్రమే సిఫారసు చేశామని ఆయన తెలిపారు. ఇక్కడ దోపిడీ జరిగింది వాస్తవం కాదా అని అనిల్‌ ప్రశ్నించారు. కులాలను తీసుకువచ్చి బయట పడాలనుకోవడం సరికాదని అనిల్‌ కుమార్‌ అన్నారు.
 

మరిన్ని వార్తలు