తమ డప్పు కొట్టుకోవడం కోసమే మహానాడు

28 May, 2020 18:01 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రాష్ట్రాన్ని రూ. 2 లక్షల కోట్ల అప్పుల పాల్జేశారని నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఎవరు దివాలా తీయించారో ప్రజలకు తెలుసన్నారు. ఆయన మీడియాతో మట్లాడుతూ.. పచ్చ మీడియా రాతలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. దుర్మార్గంగా ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. కరోనాపై సీఎం జగన్ ప్రతీరోజూ సమీక్ష చేస్తున్నారని తెలిపారు. కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ బాధితులకు ఆర్థికసాయం అందిస్తే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు కులాలు అంటగట్టింది చంద్రబాబు అని విమర్శించారు. పోలవరానికి తన పాలనలో చంద్రబాబు ఎంత ఖర్చు చేశారని సూటిగా ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే రూ.10 వేల కోట్లకుపైగా సాయం చేశారని గుర్తు చేశారు. దివంగతనేత వైఎస్సార్‌ పోలవరాన్ని ప్రారంభించారని, సీఎం జగన్ పూర్తి చేస్తారని చెప్పారు. రాయలసీమ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదన్నారు. 

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మహానాడు చంద్రబాబు జరుపుతున్నారని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌  అన్నారు. ఎన్టీఆర్ బతికి ఉంటే సీఎం జగన్‌.. చంద్రబాబును కొట్టిన దెబ్బకు సంతోష పడేవారన్నారు. ఇచ్చిన హామీల్లో 90 శాతం సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు. వ్యవస్థలను మేనేజ్ చేసుకొనే బతికే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు జీరో అయితే  సీఎం జగన్‌ ప్రజల గుండెల్లో హీరో అని చెప్పారు. తమ డప్పు తాము కొట్టుకోవడం కోసం మహానాడు పెట్టారని ఎద్దేవా చేశారు. పార్టీ నుంచి వలసలు అపుకోవడం కోసం మహానాడు పెట్టరని తెలిపారు. బాబు ఒక అబద్ధం మాట్లాడితే లోకేష్ పది అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. దివంగత నేత ఎస్సార్‌ బాటలో నడుస్తూ.. సీఎం జగన్‌ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు.
 

మరిన్ని వార్తలు