బాబును చూస్తే భయంగా ఉంది : ఎమ్మెల్యే

11 Dec, 2019 11:58 IST|Sakshi

చంద్రబాబు ఇక రెస్టు తీసుకుంటే మంచిది

వైద్యం చేయించుకున్నాక ఆయనను సభలోకి అనుమతించాలి

ప్రతిపక్ష నేత తీరుపై ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు విమర్శలు

సాక్షి, అమరావతి : చంద్రబాబు తీరు చూస్తుంటే భయంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు సేవలు చాలని, ఇక ఆయన రెస్టు తీసుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. శాసనసభలో అప్పలరాజు మాట్లాడుతూ.. ‘ఈ సభలో మేం జూనియర్స్‌. చాలా నేర్చుకోవాల్సి ఉంది. స్పీకర్‌ పట్ల చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారు. స్పీకర్‌ గారిది మా ఊరు. వెనుకబడిన వర్గాలకు స్పీకర్‌ పదవి ఇవ్వడంతో చైర్‌లో కూర్చోబెట్టేందుకు కూడా చంద్రబాబు రాలేదు. 

బాబుది ఒక మానసిక వ్యాధి. ముందుగా ఆయనకు పరీక్షలు చేయించాలి. జబ్బు నయం అయ్యాక అసెంబ్లీలోకి తీసుకురావాలి. తనది రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం అని బాబు అన్నారు. ఆయన సేవలు చాలు. ఇక రెస్టు తీసుకోవచ్చు. మరొక ఆరు నెలల్లో చాలా చూస్తారని చంద్రబాబు బెదిరించారు. బాబు మాటలు వింటుంటే భయంగా ఉంది. మొన్న పార్లమెంట్‌కు వెళ్లినప్పుడు వంగి ఉన్నారు. నిన్న అమరావతి వెళ్లి పడుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దండ వేసుకున్నారు. ఆయనను చూస్తే భయంగా ఉంది. డాక్టర్‌కు చెప్పి ఆయనకు ఉన్న వ్యాధిని నయం చేయాలి. మా ఊరి నాయకుడి పట్ల అనుచితంగా మాట్లాడితే ఊరుకోం’అని అన్నారు.

క్షమాపణ చెబితే గౌరంగా ఉంటుంది..
ప్రతిపక్ష నేత చంద్రబాబు సభకు క్షమాపణ చెబితే గౌరవంగా ఉంటుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఇవాళ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సభకు నాయకత్వం వహించి సభను చక్కగా నడిపిస్తున్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. సభలో జరిగిన పరిణామాలను యావత్‌ ప్రజలు గమనిస్తున్నారు. చట్టసభలో ఏం నేర్చుకుంటున్నాం. సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. మహానేత వైఎస్సార్‌ కలలను నెరవేర్చే అవకాశం వచ్చింది. అందరం మర్యాదగా నడుచుకోవాలి. ప్రతిపక్ష నేత ఇప్పటికైనా తన తీరు మార్చుకుంటే బాగుంటుంది’అని సూచించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విపత్తులోనూ శవ రాజకీయాలా?

మా జీవితాలను తగ్గించొద్దు..

కరకట్ట వదిలి హైదరాబాద్‌కు పలాయనం..

ఉద్యోగులను బాబు కించపరుస్తున్నారు: సజ్జల

ముందుచూపులేని ‘లాక్‌డౌన్‌’

సినిమా

ఎంతో నేర్చుకున్నా

జోడీ కుదిరిందా?

గురి మారింది

దొరికిన‌ అవ‌కాశాన్ని వ‌దులుకోనంటున్న మ‌హేశ్‌

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

ప్ర‌ధానిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రంగోలీ