ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

12 Jun, 2019 15:54 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ నూతన అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల అయింది. సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్‌ దాఖలుకు అవకాశం ఉంది. శాసన సభ కార్యదర్శి వద్ద నామినేషన్‌ దాఖలు చేయాలని ప్రొటెం స్పీకర్‌ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు ప్రకటించారు. కాగా స్పీకర్‌గా ఇప్పటికే తమ్మినేని సీతారాం పేరును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. స్పీకర్‌ పదవికి తమ్మినేని సీతారాం నామినేష్‌ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 30 మంది సభ్యులు మద్దతు పలికారు. సాయంత్రం 5 గంటలతో నామినేషన్‌ గడువు ముగుస్తుంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. స్పీకర్‌గా తమ్మినేని రేపు అధికారికంగా భాధ్యతలు చేపట్టనున్నారు.కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి ఏర్పాటైన అసెంబ్లీ సమావేశం రేపటికి వాయిదా పడింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మినహా 173మంది సభ్యులు ప్రమాణస్వీకారం పూర్తయింది. 

మరిన్ని వార్తలు