నిరుద్యోగులకు మళ్లీ మొండిచేయి..

9 Mar, 2018 08:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయింపు

2017–18లో కేటాయించిన మొత్తం 500కోట్లు 

ఖర్చు చేసిన మొత్తం 0

సాక్షి, అమరావతి: ఇంటికో ఉద్యోగం – ఉపాధి కల్పిస్తామని, ఇవ్వలేకపోతే నెలకు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు నాలుగేళ్ళుగా వంచిస్తూనే ఉన్నారు. రెండేళ్లపాటు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. గత సంవత్సరం రూ. 500 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఇంతవరకు ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు.

రాష్ట్రంలో సుమారు కోటిన్నర కుటుంబాలు ఉన్నాయి. ఈ లెక్కన నెలకు రూ. 3వేల కోట్లు ప్రభుత్వం నిరుద్యోగులకు బకాయి ఉంది. సంవత్సరానికి రూ. 36వేల కోట్లు.. నాలుగేళ్ళలో రూ. 1.44 లక్షల కోట్లు ప్రభుత్వం నిరుద్యోగులకు బకాయిపడింది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా కలుపుకుంటే రూ. 1.80 లక్షల కోట్లు. మరి రూ. 1,000 కోట్లు ఏమూలకు? 2016లో ప్రభుత్వం నిర్వహించిన పల్స్‌ సర్వేలో 35 సంవత్సరాల లోపు నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించారు. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతరుల వివరాలు ప్రభుత్వం నమోదు చేసింది. పదో తరగతి నుంచి పీజీ వరకు ఏ తరగతిలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఒక లెక్క తయారు చేసింది.

దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగులు 24 లక్షల మంది ఉన్నట్లు చెబుతున్నది. పదో తరగతి చదివిన వారు 6.25 లక్షల మంది, పాలిటెక్నిక్, ఐటీఐ వంటి సాంకేతిక అర్హతలు కలిగిన వారు 2.89 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వం చెబుతున్నది. పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర అర్హతలు కలిగిన వారు 2.07 లక్షల మంది ఉన్నట్లు ఆరు నెలల క్రితం ప్రభుత్వం అధికారిక లెక్కలు తయారు చేసింది. 

ప్రభుత్వం చెబుతున్న ప్రకారమే చూసినా అన్ని తరగతులకు సంబంధించి 33,70,315 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎస్సీ నిరుద్యోగులు 6,11,309, ఎస్టీ నిరుద్యోగులు 1,38,328, బీసీ నిరుద్యోగులు 16,20,823, దివ్యాంగ నిరుద్యోగులు 11,683, ఇతరులు 9,88,172 మంది ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు తయారు చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా ఈ 33,70,315 మందికి నెలకు రూ.2వేల చొప్పున ఎంత ఇవ్వాలి? ఇపుడు కేటాయించిన రూ.1,000 కోట్లు ఏ మూలకు..?

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి

టీడీపీ నేతలు ‘గడ్డి’ని కూడా వదల్లేదు..

కాచిగూడ కార్పొరేటర్‌ చైతన్యకు ఊరట

50 శాతం సీట్లు ఇస్తేనే పొత్తు..

టీఆర్‌ఎస్‌ను గద్దె దించేది ‘ఆ నలుగురే’

‘కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదు’

చంద్రబాబు సరిగా బ్రీఫ్‌ చేసినట్లు లేరు..

‘నేను పార్టీ మారడం లేదు’

‘ఆయనలా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు’

కోర్కెలు తీర్చే దేవుడు జగనన్న : జనసేన ఎమ్మెల్యే

సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!

‘ఆ 26 భవనాలకు నోటీసులు ఇచ్చాం’

టీడీపీ సభ్యులకు సీఎం జగన్‌ సూచన..!

కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

టీడీపీ సభ్యుల తీరుపై భగ్గుమన్న స్పీకర్‌..!

‘5 కోట్ల పనిని 137 కోట్లకు పెంచారు’

‘కిసాన్‌ సమ్మాన్‌’తో రైతులకు అవమానమే

కాళేశ్వరం.. తెలంగాణకు వరం

సిరా ఆరకముందే 80% హామీల అమలు

బెజవాడలో టీడీపీ నేతల సిగపట్లు

‘కాపు’ కాస్తాం

ఎంపీలకు ఢిల్లీ తెలుగు అకాడమీ సన్మానం

మంత్రుల డుమ్మాపై మోదీ ఫైర్‌

కర్నాటకంపై నేడే సుప్రీం తీర్పు 

మంచి రోడ్లు కావాలంటే టోల్‌ ఫీజు కట్టాల్సిందే 

బీజేపీలో చేరిన మాజీ ప్రధాని కుమారుడు

జయప్రద వర్సెస్‌ డింపుల్!

‘విభజన హామీలు నెరవేర్చుతాం’

అసెంబ్లీ ఎన్నికలు: కమలానికి కొత్త సారథి

‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌