బడ్జెట్‌కు ఆమోదం.. బీజేపీ మంత్రులు గైర్హాజరు

8 Mar, 2018 08:35 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం అయింది. 2018-19 బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి బీజేపీ మంత్రులు దూరంగా ఉన్నారు. అత్యంత కీలకమైన ఈ బడ్జెట్‌కు బీజేపీ మంత్రులు కామినేని, మాణిక్యాలరావు గైర్హాజరయ్యారు. గురువారం ఉదయం 11.30గంటలకు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌ మొత్తం రూ.1,96,800కోట్లుగా ఉండనుంది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,63,660 కోట్లు కాగా, కేపిటల్‌ వ్యయం కింద రూ.33,160 కోట్లు ప్రతిపాదించనున్నారు.

14వ ఆర్థిక సంఘం అంచనా మేరకు ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తిని రూ.8,70,330 కోట్లుగా పేర్కొన్నారు. రూ,30,000కోట్లు అప్పు చేయనున్నారు. ఇక సొంత పన్నుల ద్వారా రూ.70 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రతిపాదించారు. మరోపక్క, కేబినెట్‌ సమావేశానికి దూరంగా ఉన్న బీజేపీ మంత్రులు అసెంబ్లీలో రాజీనామాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుకు వారు రాజీనామా లేఖలు ఇవ్వనున్నారు. మంత్రి కామినేని, మాణిక్యాలరావు రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో వారు ఈ నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే అధికారిక వాహనాలను, ఐడీ కార్డులను వారు వదులుకున్నారు.

మరిన్ని వార్తలు