‘బాబు చేసేది బూతుల యాత్ర’

26 Feb, 2020 11:17 IST|Sakshi

సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులపై చంద్రబాబు నాయుడు దాడులు చేయిస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళితులకు ఎకరా భూమిని కూడా ఇవ్వని చంద్రబాబు నేడు అసైన్డ్ భూముల గురించి మాట్లాడడం సిగ్గు చేటు అని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని ఆయన గుర్తు చేశారు. అనంతపురానికి వైఎస్సార్‌ నీరు ఇవ్వడం వల్లనే కియా పరిశ్రమ వచ్చిందని, చంద్రబాబు మొహం చూసి కాదని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..
(చదవండి : అసనగిరి కొండల్లో.. ‘అల్లూరి’ గుహలు నిజమే)

‘ప్రజా చైతన్య యాత్రలకు స్పందన రాకపోవడంతో చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు చేసేది ప్రజా చైతన్య యాత్ర కాదు పచ్చి బూతుల యాత్ర. మద్యాన్ని ప్రోత్సహించే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. మద్యపాన నిషేధం చేయాలని గతంలో రామోజీరావు వార్తలు రాశారు. రామోజీరావు ఇప్పుడు ఆ సంగతి ఎందుకు మర్చిపోయారో తెలియదు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే పాస్ పుస్తం కోసం రూ.లక్ష లంచం ఇచ్చానని ఓ రైతు చెప్పాడు. చంద్రబాబు హయాంలో రైతులు ఎంత ఇబ్బంది రైతు మాటల్లో తెలుస్తోంది. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా కుప్పంలో మంచి నీటి సమస్యను చంద్రబాబు పరిష్కారం చేయలేక పోయారు.

బీసీలకు 59 శాతం రిజర్వేషన్లు ఇవ్వొద్దని చంద్రబాబు కోర్టులో కేసు వేయించారు. చంద్రబాబు చేష్టలు చూసి మనిషి అనాలో పశువు అనాలో తెలియడం లేదు. గతంలో ట్రంప్‌ను ఓడించాలని పిలుపు నిచ్చారు. మళ్లీ ఈ రోజు ట్రంప్‌ గెలుపును గురించి ఆయన మాట్లాడడం హాస్యాస్పదం. సీఎం వైఎస్‌ జగన్‌ను ఢిల్లీకి పిలవకపోవడాన్ని రాజకీయం చేస్తున్నారు. 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులను మాత్రమే పిలిచారు. అది రొటేషన్ పద్దతిలో జరిగే పక్రియ’అని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు