నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ భేటీ

7 Aug, 2019 14:24 IST|Sakshi

గంటపాటు కొనసాగిన సమావేశం

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులపై చర్చించారు. దాదాపు గంటపాటు సమావేశం కొనసాగింది. సమావేశానంతరం గడ్కరీ సీఎం జగన్‌కు వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి, రఘురామకృషంరాజు, సురేష్‌, రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణంబాబు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రమేష్‌ బాబు ఈ సమావేశంలో పాల్కొన్నారు. అంతకు ముందు సీఎం జగన్‌ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అయ్యారు. 

కాగా, మంగళవారం ఢిల్లీ వెళ్లిన వైఎస్‌ జగన్‌.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం 13వ షెడ్యూలులో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరిన విషయం తెలిసిందే. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో నిన్న సాయంత్రం 4.35 గంటల నుంచి 5.20 వరకు 45 నిమిషాల పాటు ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానికి వినతిపత్రం సమర్పించారు.

మరిన్ని వార్తలు