ఉప రాష్ట్రపతితో సీఎం జగన్‌ సమావేశం

7 Aug, 2019 09:46 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సమావేశం అ‍య్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, నందిగం సురేష్‌, బాల శౌరి పాల్గొన్నారు. సుమారు అరగంట పాటు ఈ సమావేశం కొనసాగింది. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌...రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రితో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులపై చర్చించారు.

కాగా నిన్న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌...ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం 13వ షెడ్యూలులో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరిన విషయం తెలిసిందే. మంగళవారం పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో సాయంత్రం 4.35 గంటల నుంచి 5.20 వరకు 45 నిమిషాల పాటు ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. 

చదవండిప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అదృష్టం బాగుండి ఆయన ఇప్పడు అధికారంలో లేరు గానీ..

తెలంగాణ చిన్నమ్మగా నిలిచిపోతారు

మోదీ-షా తదుపరి టార్గెట్‌ అదేనా?

‘ఒక్క రూపాయి ఫీజు కోసం ఇంటికి రమ్మన్నారు’

‘మా అమ్మను హరి నివాస్‌లో బంధించారు’

సుష్మ మృతి: కంటతడి పెట్టిన మోదీ

ట్విటర్‌ ఫైటర్‌ను కోల్పోయా : పాక్‌ మంత్రి

అలా అయితే నేల మీదే పడుకుంటా; సుష్మ భీష్మ ప్రతిఙ్ఞ!

కోడెలకు టీడీపీ నేతల ఝలక్

ఏడాదిలో ముగ్గురు మాజీ సీఎంలు మృతి

ప్రజలారా ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి

ఏపీ విభజన ఏకపక్షమే

అధీర్‌ వ్యాఖ్యలతో ఇరకాటంలో కాంగ్రెస్‌ 

మేం పోరాడతాం కోర్టుకు వెళ్తాం

మాటలన్నీ తూటాలే!

సుష్మా హఠాన్మరణం

బంగ్లా హోంమంత్రిని సాధరంగా ఆహ్వానించిన కిషన్‌రెడ్డి

కశ్మీర్‌ విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఏపీ విభజనపై కాంగ్రెస్‌ అసత్యాలు: అమిత్‌ షా

ఆర్టికల్‌ 370 రద్దు; ఒవైసీ కామెంట్స్‌

‘మోదీ, షా కూడా నెహ్రూలా ఆలోచించేవాళ్లే..’

ఆర్టికల్‌ 370 రద్దు; మాకు పాఠాలు చెప్పొద్దు

ముగిసిన ప్రధాని మోదీ-సీఎం జగన్‌ భేటీ

మీడియా ఎదుట ఫరూక్‌ భావోద్వేగం..!

పీఓకేపై కేంద్రం వైఖరేంటి?

‘ఫరూక్‌ను నిర్భందించలేదు’

‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం’

డెమోక్రసి గుండెల్లో 370 బుల్లెట్‌!

‘నల్లమలను లూటీ చేయాలని చూస్తున్నారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్టార్‌ హీరో ఇంట విషాదం

బీ టౌన్‌ రోడ్డుపై ఆర్‌ఎక్స్‌ 100

పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌

కామెడీ కాస్తా కాంట్రవర్సీ!

చాలెంజింగ్‌ దర్బార్‌

నాని విలన్‌గా సిక్స్‌ ప్యాక్‌లో