'చంద్రబాబును రాష్ట్ర ప్రజలు క్షమించరు'

17 Mar, 2020 15:38 IST|Sakshi

సాక్షి, తిరుపతి: ఎన్నికల కమిషన్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. తిరుపతిలో మంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికలను వాయిదా వేయడం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లో ఈసీ రమేష్‌కుమార్‌ నడుస్తున్నారని, ఇందుకు బాబు మాటలే నిదర్శనమన్నారు. ఎన్నికలు ఆగిపోతే కేంద్ర నిధులు నిలిచిపోతాయని, దీని వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. చదవండి: ‘అందుకే విలువలు లేని టీడీపీని వీడా’ 

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకొని ప్రజలను ఇబ్బందులపాలు చేయాలనే కుట్రతోనే ఈసీతో చేతులు కలిపి చంద్రబాబు ఎన్నికలు వాయిదా వేయించాడని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావం లేకుండా, రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు టీడీపీ మొదటి నుంచి కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు క్షమించరని హెచ్చరించారు. చదవండి: ఎన్నికల వాయిదాకే గెలిచినట్టు ఫీలవుతున్నారు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు